సూపర్ స్టార్ మహేష్ కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా `వారణాసి`తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్‌లో కీలక షెడ్యూల్‌ను జరుపుకుంటోంది. నగరంలోని ఓ భారీ సెట్‌లో సినిమాకు హైలైట్‌గా నిలిచే ప్రత్యేక గీతాన్ని చిత్రీకరిస్తున్నారు. ఈ పాట సెట్ కోసం నిర్మాతలు భారీగా ఖర్చు చేస్తున్నట్లు తెలిసింది. ఈ సెట్‌లో రాజమౌళి మార్క్ దృశ్యకావ్యం ఆవిష్కృతం అవుతుందని అంటున్నారు.
ఈ పాటకు బాలీవుడ్ కొరియోగ్రాఫర్ ద్వయం బాస్కో-మార్టిన్ పనిచేయడం విశేషం. ఈ పాటలో మహేష్ ఎనర్జీ, వినూత్నమైన స్టెప్పులు ప్రేక్షకులకు కన్నుల పండుగగా ఉంటాయని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. నిర్విరామంగా సాగుతోన్న ఈ షూటింగ్‌కు మే నెలలో సుదీర్ఘ విరామం ఇవ్వాలని జక్కన్న బృందం నిర్ణయించిందిట. ప్రధానంగా ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని సాంకేతిక నిపుణులకు , నటీనటులకు కొంత విశ్రాంతిని అవసరమని భావించి రాజమౌళి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ విరామ సమయంలో రాజమౌళి ఖాళీగా ఉండకుండా తదుపరి షెడ్యూల్స్‌కు సంబంధించిన ప్లానింగ్‌తో పాటు గ్రాఫిక్స్ పనులపై కూడా దృష్టి సారించనున్నారు. జూన్ నెలలో తిరిగి యధావిధిగా కొత్త షెడ్యూల్ మొదలవుతుంది. ఇందులో అత్యంత కీలకమైన అవుట్‌డోర్ సన్నివేశాలను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారుట. పశ్చిమాసియా యుద్దం నేపథ్యంలో వాయిదా పడిన షెడ్యూల్ మొదలవుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం యుద్ధ వాతావరణం తగ్గుముఖం పట్టడం మేకర్స్‌కు కొంత ఊరటనిచ్చే అంశం.




పెద్ది కి రీ షూట్స్ భారం
Loading..