ఊరించి ఉసూరుమనిపించారు
Nivetha Pethuraj Joins AK47
పాపం నివేత పెతురాజ్. ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో ఆమెని చూసి జాలి పడుతూ వేస్తున్న ట్వీట్స్. కారణం నివేత పెతురాజ్ తన నిశ్చితార్ధాన్ని బ్రేక్ చేసుకుంది. ప్రేమించిన వాడితో పెళ్లి వరకు వెళ్లొచ్చిన నివేత పెతురాజ్ మళ్లీ కేరీర్లో బిజీ అయ్యేందుకు ప్రయత్నం చేస్తున్న సమయంలో ఆమెకు త్రివిక్రమ్-వెంకీ ఆదర్శ కుటుంబంలో ఛాన్స్ వచ్చింది అన్నారు.
అబ్బ నివేత పెతురాజ్ కి పర్సనల్ గా ఇబ్బందిపడినా కెరీర్లో మళ్లీ మంచి కమ్ బ్యాక్ దొరికింది అనుకున్నారు. ఆమె అభిమానులు కూడా నివేత పెతురాజ్ కొచ్చిన ఛాన్స్ చూసి మురిసిపోయారు. కానీ ఇప్పుడు ఊరించి ఉసూరుమనిపించినట్టుగా నివేత పెతురాజ్ కి ఆదర్శ కుటుంబంలో వచ్చింది వెంకీ సరసనో లేదంటే మరో కీలక పాత్రో కాదు.
ఆమె ఆదర్శకుటుంబంలో ఓ స్పెషల్ సాంగ్ చేస్తుంది అంటున్నారు. ప్రస్తుతం ఆ సాంగ్ షూట్ లో నివేత పెతురాజ్ జాయిన్ అయ్యిందట. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 60 శాతం పూర్తయిందని.. ఈ షూటింగ్ ఓ కొలిక్కి రాగానే వెంకీ అనిల్ రావిపూడి సెట్ లో జాయిన్ అవుతారని తెలుస్తుంది.
















































