యంగ్ హీరోస్ లో పేరు తెచ్చుకున్న వారిలో నాగ శౌర్య ఒకడు. నాగ శౌర్య సినిమాలంటే భీబత్సమైన హైప్ లేకపోయినా, ఆడియన్స్ లో ఆసక్తి కనిపించేది. 2023 లో వచ్చిన రంగబలి తర్వాత నాగ శౌర్య చాలా స్లో అయ్యాడు. పెళ్లి, వేరు కాపురం, తర్వాత బిడ్డకు తండ్రి కావడం అన్ని సైలెంట్ గానే చేసాడు.
ఇక ఎప్పటినుంచొ ప్రొడక్షన్ లో ఉన్న బ్యాడ్ బాయ్ కార్తీక్ సడన్ గా లైన్ లోకి వచ్చి ట్రైలర్ లాంచ్ అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటూ హడావిడి చెయ్యడం తో సినిమాపై కాస్తో కూస్తో ఆసక్తి మొదలైనా.. సినిమా ముందు ప్రోపర్ ప్రమోషన్స్ లేకపోవడం సినిమాపై బజ్ క్రియేట్ అవ్వకుండా చేసింది.
ప్రొడ్యూసర్ కొన్ని కారణాల వల్ల సినిమా రిలీజ్ లేట్ అయ్యింది క్షమించమన్నా సినిమా కి హైప్పో లేకపోతే ఓపెనింగ్స్ ఉండవు. ఈమధ్య కాలంలో చిన్న హీరో అయినా, పెద్ద హీరో అయినా ముందు రోజే ప్రీమియర్స్ తో మీడియాకి షో వేస్తున్నారు. లేదంటే రిలీజ్ రోజే మీడియాకి సినిమా చూపిస్తున్నారు.
కానీ నాగ శౌర్య బ్యాడ్ బాయ్ కార్తీక్ కి ఆ అదృష్టము లేదు. అసలు బ్యాడ్ బాయ్ కార్తీక్ కి రివ్యూస్ లేవు అంటే.. నిజంగా ఇది నాగ శౌర్య కి ఎంత అవమానం. అసలు నాగ శౌర్య అండ్ టీమ్ ఎందుకింత లైట్ గా ఉందొ వాళ్ళకే తెలియాలి.




ఎఫ్ఫైర్ రూమర్స్ పై కంగనా కౌంటర్
Loading..