Advertisementt

విజయ్ పై వ్యతిరేఖత స్టార్ట్

Fri 17th Apr 2026 11:54 AM
vijay  విజయ్ పై వ్యతిరేఖత స్టార్ట్
Vijay TVK Party విజయ్ పై వ్యతిరేఖత స్టార్ట్
Advertisement
Ads by CJ

హీరో విజయ్ పొలిటికల్ గా బిజీ అయ్యారు. TVK పార్టీ పెట్టి రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అందుకోసం నియోజకవర్గాల వారీగా తన పార్టీలో చేరిన వారిని నిలబెడుతూ తను కూడా రెండు నియోజక వర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. విజయ్ రాజకీయాల్లోకి వెళ్ళింది మొదలు ఆయన్ని సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఓ పక్క చివరి సినిమా రిలీజ్ అవ్వకుండా సమస్యలు వచ్చాయి.

మరోపక్క భార్య సంగీత విడాకుల విషయంలో కోర్టు కెక్కింది, ఇంకోపక్క ర్యాలీలు నిర్వహిస్తుంటే కేసులు ఇలా విజయ్ అన్ని విధాలుగా లాక్ అవుతున్నారు. ఇప్పుడు విజయ్ కి తన పార్టీ నేతల నుంచే వ్యతిరేఖత మొదలైంది. టీవీకే లో కీలక నేతగా పేరు పొందిన మాజీ మంత్రి సెంగొట్టయాన్ త్వరలో TVKను వీడబోతున్నట్లు ఆయన సన్నిహితుడు చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి.

TVK నుంచి సెంగోట్టయాన్ బయటకు వచ్చే ఆలోచనలో ఉన్నారని, TVKలో తనకు గౌరవం లభించడం లేదని సెంగోట్టయాయన్ తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు విజయభాస్కర్ ఓ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది. అన్నాడీఎంకే నుంచి టీవీకేలోకి వెళ్లిన సెంగోట్టైయన్ .. గోబిచెట్టిపాళయం స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. 

మరో నాలుగు రోజుల్లో ఎన్నికను జరగనుండగా ఇప్పుడు కీలక నేత విజయ్ కి షాకిస్తూ పార్టీ నుంచి తప్పుకోవాలని ఆలోచన చెయ్యడం విజయ్ పార్టీ పై ఎఫక్ట్ పడే ప్రమాదం లేకపోలేదు. 

Vijay TVK Party:

Tamilanadu-Vijay TVK Party

Tags:   VIJAY
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ