Advertisementt

మ‌రోసారి బాక్సాఫీస్ వ‌ద్ద మెగా క్లాష్!

Fri 17th Apr 2026 10:29 AM
prabhas  మ‌రోసారి బాక్సాఫీస్ వ‌ద్ద మెగా క్లాష్!
Fauzi vs King మ‌రోసారి బాక్సాఫీస్ వ‌ద్ద మెగా క్లాష్!
Advertisement
Ads by CJ

మరోసారి బాక్సాఫీస్ యుద్ధానికి రంగం  సిద్ధమవుతోందా? అంటే స‌న్నివేశం అలాగే క‌నిపిస్తోంది. గ్లోబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ మరోసారి థియేటర్ల వద్ద తలపడే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. గతంలో `సలార్`, `డంకీ` చిత్రాల మధ్య జరిగిన హోరాహోరీ పోరును తలపిస్తూ ఈసారి `ఫౌజీ` - `కింగ్` చిత్రాల మధ్య బాక్సాఫీస్ వార్ తప్పదని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టి చర్చ నడుస్తోంది. షారుక్ ఖాన్ తన కుమార్తె సుహానా ఖాన్‌ను వెండితెరకు పరిచయం చేస్తూ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న `కింగ్` చిత్రాన్ని ఇప్పటికే డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా విడుదల చేస్తామని అధికారికంగా ప్రకటించేశారు.

మరోవైపు ప్రభాస్ - హను రాఘవపూడి కాంబినేషన్‌లో  తెర‌కెక్కుతోన్న పీరియాడిక్ డ్రామా `ఫౌజీ` శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. చిత్ర యూనిట్ మొదట ఆగస్టు లేదా అక్టోబర్ (దసరా) విడుదలను లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ భారీ విజువల్ ఎఫెక్ట్స్ , నిర్మాణ విలువల దృష్ట్యా షూటింగ్ ఆలస్యమైతే ప్లాన్ సి ని అమలు చేయాలని చూస్తున్నారు. అంటే అక్టోబర్ నుండి ఈ సినిమా కూడా డిసెంబర్ నెలకు వాయిదా పడే అవకాశం ఉంది. ఒకవేళ `ఫౌజీ` క్రిస్మస్ రేసులోకి వస్తే షారుక్ `కింగ్` కు గట్టి పోటీ ఎదురవ్వడం ఖాయం.

గత ఏడాది క్రిస్మస్ సీజన్‌లో `సలార్` చిత్రంతో ప్రభాస్ భారీ వసూళ్లను సాధించి పైచేయి సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ అదే పండుగ సీజన్‌లో  ఇద్దరు సూపర్ స్టార్స్ పోటీ పడితే ముఖ్యంగా తెలుగు మరియు హిందీ మార్కెట్లలో థియేటర్ల కేటాయింపు విషయంలో పెద్ద యుద్ధమే జ‌ర‌గొచ్చు. బాలీవుడ్ నుంచి `ధురంధర్` వంటి చిత్రాలు సవాల్ విసురుతున్నా? ప్రభాస్ తన గ్లోబల్ ఇమేజ్‌తో షారుక్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ మెగా క్లాష్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Fauzi vs King:

Prabhas vs SRK

Tags:   PRABHAS
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ