రెడ్ ఫ్రాక్ లో కృతి శెట్టి

Krithi Shetty new look viralKrithi Shetty new look viral


ఈ హీరోయిన్ ని దురదృష్టం జిడ్డులా పట్టుకుంది. ఒకటి కాదు రెండు కాదు వరస సినిమాలు నిరాశ పరిచే ఫలితాలతో కృతి శెట్టి ని ఐరెన్ లెగ్ గా మార్చేశాయి. సినిమా ప్లాప్ అయితే కేవలం హీరోయిన్ నే ఐరెన్ లెగ్ అంటూ మాట్లాడతారు. అందుకు బాద్యులుగా హీరోయిన్స్ నే చూపిస్తారు అంటూ రీసెంట్ గానే ఓ సినిమా ప్రమోషన్స్ లో చెప్పింది.

ఈ ఏడాది తమిళనాట బ్యాక్ టు బ్యాక్ ప్లాప్ లు కొట్టిన కృతి శెట్టి ని అనిల్ రావిపూడి నే ఒడ్డున పడెయ్యాలి. వెంకీ-కళ్యాణ్ రామ్ కలయికలో అనిల్ రావిపూడి తెరకెక్కించబోయే మూవీ లో కళ్యాణ్ రామ్ కి జోడిగా కృతి శెట్టి నే ఎంపిక చేసారు. అయితే కొన్నాళ్లుగా కృతి శెట్టి సోషల్ మీడియా లుక్ మార్చేసింది.

గ్లామర్ షో చేస్తూ అందాలు ఆరబోస్తూ కృతి శెట్టి అవకాశాల కోసం ఆరాటపడుతుంది. తాజాగా రెడ్ ఫ్రాక్ లో కృతి శెట్టి బ్యూటిఫుల్ గా కనిపించింది. రెడ్ ఫ్రాక్, లూజ్ హెయిర్, మతిపోగోట్టే అందాలతో ఆకర్షణగా కనిపించింది. కృతి శెట్టి న్యూ లుక్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Krithi Shetty latest look go viral