Advertisementt

కుమార్తెల పెళ్లిపై రాజ‌శేఖ‌ర్ మ‌న‌సులో మాట‌!

Wed 15th Apr 2026 05:50 PM
rajasekhar  కుమార్తెల పెళ్లిపై రాజ‌శేఖ‌ర్ మ‌న‌సులో మాట‌!
Rajasekhar and his daughters కుమార్తెల పెళ్లిపై రాజ‌శేఖ‌ర్ మ‌న‌సులో మాట‌!
Advertisement
Ads by CJ

యాంగ్రీ మ్యాన్  రాజశేఖ‌ర్  వ్యక్తిగత జీవితం - వృత్తిపరమైన విశేషాలను పంచుకుంటూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త‌న కుమార్తెలు శివాని, శివాత్మికల కెరీర్ గురించి స్పందించారు. వారికి పెళ్లి సంబంధాలు వస్తున్న మాట వాస్తవమేనన్నారు.  అయితే  ప్రస్తుతం వారు  సినిమాల్లోనే స్థిరపడాలని బలంగా కోరుకుంటున్నారని  తెలిపారు. పిల్లల ఇష్టమే తమకు ప్రాధాన్యత అని, అందుకే  వారి పెళ్లి ఆలోచనలు పక్కన పెట్టినట్లు రాజశేఖర్ స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా   రాజకీయ ప్రస్థానంపై కూడా రాజశేఖర్ కీలక విషయాలను వెల్లడించారు. తాము రాజకీయాల్లో ఉన్న కాలంలో ఎవరిపైనా ఆధారపడకుండా సొంత డబ్బునే ఖర్చు చేశామని  గర్వంగా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తన భార్య జీవితకు రాజకీయాలపై పెద్దగా ఆసక్తి లేదని పేర్కొన్నారు. ఇదే క్రమంలో తమిళ స్టార్ హీరో విజయ్ రాజకీయ రంగ ప్రవేశం గురించి స్పందిస్తూ `విజయ్ రాజకీయాల్లోకి రావడం శుభపరిణామమని, రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు మెరుగైన విజయావకాశాలు ఉన్నాయని అభిప్రాయ‌ప‌డ్డారు.

చాలా కాలం తర్వాత రాజశేఖర్ మళ్లీ వెండితెరపై క‌నిపించ‌డం ఆయ‌న‌ అభిమానులకు ఎంతో  సంతోషాన్నిస్తోంది. `బైకర్` చిత్రంలో శర్వానంద్‌కు తండ్రిగా  రాజ‌శేఖ‌ర్ పోషించిన పాత్రకు విమర్శకుల నుండి ప్రశంసలు దక్కుతున్నాయి. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రం ద్వారా రాజశేఖర్ తన సెకండ్ ఇన్నింగ్స్‌లో వైవిధ్యమైన పాత్రలకు తాను సిద్ధమనే సంకేతాలను ఇచ్చారు. నటుడిగా తనదైన ముద్ర వేస్తూనే, కుటుంబ బాధ్యతలను , సామాజిక అంశాలను సమన్వయం చేసుకుంటూ ఆయన సాగిస్తున్న ప్రయాణం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. భవిష్య‌త్ లో అగ్ర తారాల చిత్రాల్లో యాంగ్రీమ్యాన్ కీల‌క పాత్ర‌లు పోషించాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు.

Rajasekhar and his daughters:

Rajasekhar 

Tags:   RAJASEKHAR
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ