Advertisementt

ఎన్టీఆర్ బర్త్ డే కి అది సాధ్యమేనా

Wed 15th Apr 2026 10:53 AM
ntr  ఎన్టీఆర్ బర్త్ డే కి అది సాధ్యమేనా
NTR birthday special treats ఎన్టీఆర్ బర్త్ డే కి అది సాధ్యమేనా
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే కి ఇంకా నెల సమయం ఉంది. మే 20 ఈ బుడ్డోడి బర్త్ డే. మరా బర్త్ డే కి ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ చేస్తున్న మూవీ నుంచి ట్రీట్ అనేది పక్కా. అది డ్రాగన్ టైటిల్ రివీల్ ఉంటుందా, లేదంటే ఫస్ట్ లుక్ ఇస్తారా, కాదు అంటే టీజర్ ఇచ్చి సర్ ప్రైజ్ చేస్తారా అనే విషయంలో ఫ్యాన్స్ లో ఎన్నో అనుమానాలున్నాయి.

కానీ అందులో ఏదో ఒకటి పక్కా, ఎన్నో విషయాలు రివీల్ చెయ్యాలి. ఎన్టీఆర్-నీల్ మూవీ స్టార్ట్ అవడమే కానీ అందుకు సంబందించిన మరే ఇతర అప్ డేట్ మేకర్స్ అధికారికంగా ఇవ్వలేదు. ఈ వారంలో ఎన్టీఆర్ కి విలన్ గా షాహిద్ కపూర్ కనిపిస్తాడు అంటే, ఎన్టీఆర్ సినిమాలో కీ రోల్ కోసం అలియా భట్ ని సంప్రదిస్తున్నారు అన్నారు.

ఇవన్నీ ఒక ఎత్తు, ముఖ్యంగా ఎన్టీఆర్-త్రివిక్రమ్ కలయికలో అనౌన్సమెంట్ వచ్చి ఆగిన సినిమా అప్ డేట్ కూడా ఉండబోతుంది అనే కొత్త సమాచారం. మరి ఎన్టీఆర్ బర్త్ డే కి ఇవన్నీ ఇవ్వడం సాధ్యమేనా, ఇస్తారా లేదంటే ఊరించి ఊరించి ఉసూరుమనిపిస్తారా అనేది ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో తొంగి చూస్తున్న అనుమానం. 

NTR birthday special treats :

Two Treats On NTR Birthday

Tags:   NTR
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ