మార్చ్ 19 న కన్నడ స్టార్ హీరో టాక్సిక్ ద మూవీ రిలీజ్, మార్చి 27 న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది రిలీజ్ అనుకున్నారు. కానీ ధురంధర్ 2, అలాగే గల్ఫ్ యుద్ధం అన్ని యష్ టాక్సిక్ ని, రామ్ చరణ్ పెద్ది ని పోస్ట్ పోన్ అయ్యేలా చేసాయి. పోస్ట్ పోన్ అంటూనే యష్ టాక్సిక్ ని జూన్ 4 విడుదల అంటూ డేట్ లాక్ చేసి అనౌన్స్ చేసారు మేకర్స్.
ఇక ఏప్రిల్ 30 నుంచి టెక్నీకల్ కారణాలతో పోస్ట్ పోన్ అవ్వనున్న పెద్ది చిత్రాన్ని జూన్ 25 కి రిలీజ్ చేద్దామనుకున్నా అప్పుడు అఖిల్ లెనిన్ రిలీజ్ ఉండడంతో పెద్ది మేకర్స్ మరోసారి లెనిన్ ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక పెద్ది ని జూన్ 4న విడుదల చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నారట.
మరి జూన్ 4 అంటే యష్ టాక్సిక్ ఉండనే ఉంది. సో మార్చ్ లో తప్పిన టాక్సిక్ vs పెద్ది ఫైట్ ఈసారి జూన్ లో తప్పేలా కనిపించడం లేదు. మరి క్రేజీ పాన్ ఇండియా మూవీస్ మధ్యన ఫైట్ అయినా ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది ఆడియన్స్ కి





LIK ప్లాప్ ఆయన ఖాతాలోకే

Loading..