Advertisementt

జన నాయగన్ లీకుల దొంగలు దొరికినట్లే !

Mon 13th Apr 2026 09:51 AM
jana nayagan  జన నాయగన్ లీకుల దొంగలు దొరికినట్లే !
Jana Nayagan leak - 6 people arrested జన నాయగన్ లీకుల దొంగలు దొరికినట్లే !
Advertisement
Ads by CJ

విజయ్ లేటెస్ట్ మూవీ జన నాయగన్ విడుదల సమస్యలు ఎదుర్కుంటున్న సమయంలో ఆ చిత్రంలోని కీలక సన్నివేశాలను లీక్ చేసి పారేసారు లీకుల రాయుళ్లు. జనవరి 9 న పోస్ట్ పోన్ అయిన జన నాయగన్ విడుదల ఎప్పుడు ఉంటుందో క్లారిటీ లేదు, మరోపక్క ఓటీటీ డీల్ క్యాన్సిల్ అయ్యి నిర్మాతలు లబోదిబోమంటున్నారు.

అంతేకాదు హీరో విజయ్ పార్టీ ని గెలిపించుకునే ప్రయత్నంలో తమిళనాడు ప్రభుత్వంతో పోరాడుతున్నారు. ఈ సమయంలో జన నాయగన్ లీకులు నిర్మాతలను టెన్షన్ పెడుతున్నాయి. ఎంతగా అవి స్ప్రెడ్ కాకుండా చర్యలు తీసుకున్నా సోషల్ మీడియాలో మాత్రం జన నాయగన్ లీకులు దావానలంలా వ్యాపించాయి. 

నిర్మాతలు సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ చెయ్యగా.. పోలీసులు జన నాయగన్ సీన్స్ లీక్ చేసిన ఆరుగురిని అరెస్ట్ చేసారు. జన నాయగన్ సీన్స్ ని ఏ విధంగా అయినా స్ప్రెడ్ చేసినా, డౌన్ లోడ్ చేసుకున్నా తగిన చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే సైబర్ క్రైమ్ విభాగం ఆరుగురిని అరెస్ట్ చేసినట్లుగా లాయర్ పేర్కొన్నారు.

Jana Nayagan leak - 6 people arrested:

Tamil Nadu cyber crime arrests over Jana Nayagan HD leak

Tags:   JANA NAYAGAN
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ