మెగా ఫ్యాన్స్ కి దొరికితే ఇక అంతే

Sun 12th Apr 2026 05:38 PM
anudeep  మెగా ఫ్యాన్స్ కి దొరికితే ఇక అంతే
Anudeep katikala stand up comedian controversy comments మెగా ఫ్యాన్స్ కి దొరికితే ఇక అంతే

స్టాండప్ కామెడీ చేసుకునే అనుదీప్ కటికాల మెగా హీరోలను కామెడీ పేరుతొ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయంలో మెగా ఫ్యాన్స్ అనుదీప్ కటికాల ను వెతుకుతున్నారు. అతను ఎక్కడ కనిపించినా బుద్ధి చెప్పాలనే కసితో మెగా ఫ్యాన్స్ ఉన్నారు. కానీ అనుదీప్ కటికాల వారికీ దొరికే ఛాన్స్ లేదు, కారణం అతను పరారిలో ఉన్నట్లుగా తెలుస్తుంది.

అనుదీప్ కటికాల కామెడీ పేరు తో ప్రముఖులను టార్గెట్ చేస్తూ జోక్స్ వేసి ఆడియన్స్ ని నవ్వించిన విషయంలో అతనిపై మెగా ఫ్యాన్స్ ఆగ్రహంతో ఊగిపోతున్నారు. పవన్ కళ్యాణ్, నారా లోకేష్, బాలకృష్ణ లాంటి ప్రముఖులపై వ్యక్తిగత జీవితాలను కించపరిచే విధంగా రాజకీయనేతలను అనుదీప్ టార్గెట్ చెయ్యడం అభిమానులకు విపరీతమైన కోపం తెప్పించింది. 

ఒకవైపు నందమూరి అభిమానులు, మరోవైపు మెగా అభిమానులు ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందిస్తున్నారు. అంతేకాదు అనుదీప్ కనబడితే కొట్టడానికి అందరూ సిద్ధమవుతున్నారు. గతంలో రాజశేఖర్ దంపతులు చిరుని ఒక్క మాట అన్నందుకు మెగా ఫ్యాన్స్ వారికీ దాదాపుగా చుక్కలు చూపించిన విషయం తెలిసిందే. ఇపుడు కూడా అనుదీప్ ని వదిలే ప్రసక్తే లేదు అంటున్నారు. కానీ అనుదీప్ కటికాల ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని పరారీలో ఉన్నట్లుగా తెలుస్తుంది. 

Anudeep katikala stand up comedian controversy comments :

Anudeep katikala controversy comments on Pawan and Balayya and Nara Lokesh

Tags:   ANUDEEP