Loading...

ఈ గ్లామర్ ని ఇంకెవరు పట్టించుకుంటారు

Kajal Agarwal latest look


హీరోయిన్స్ కి పెళ్ళై పిల్లలు పుడితే వారి కెరీర్ ఇక అంతే. కానీ బాలీవుడ్ లో అలా కాదు.. హీరోయిన్స్ పీక్ స్టేజ్ లో పెళ్లిళ్లు చేసుకుని పిల్లలను ప్లాన్ చేసుకున్నా వారి గ్లామర్ వారిని మళ్లీ బిజీ అయ్యేందుకు హెల్ప్ చేస్తుంది. కానీ సౌత్ హీరోయిన్స్ మాత్రం ఏజ్ దాటిపోయాక పెళ్లిళ్లు, పిల్లలు అంటారు.

దానితో వారికి డిమాండ్ తగ్గిపోతుంది. శ్రీయ శరణ్ పెళ్లి చేసుకుని గుట్టుగా పిల్లలను కని మళ్లీ నాజూగ్గా తయారైనా ఆమెకు అవకాశాలు రావడం లేదు. ఇక కాజల్ అగర్వాల్ కూడా పెళ్లి చేసుకుంది, బాబు ని కనింది. ఆతర్వాత ప్రెగ్నెన్సీ బరువు తగ్గించుకుని మళ్లీ గ్లామర్ షో మొదలు పెట్టింది. సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటో షేర్ చేస్తుంది.

ఒకప్పుడు టాలీవుడ్, కోలీవుడ్ లో స్టార్ డమ్ ని మైంటైన్ చేసిన కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత డల్ అయ్యింది. బాబు పుట్టాక చాలా వర్కౌట్స్ చేసి మళ్లీ నాజూగ్గా తయారైంది. గ్లామర్ షో చేస్తుంది. కానీ అవకాశాలు సన్నగిల్లాయి. రీసెంట్ గా నయన్ తప్పుకున్న NBK 111 ప్రాజెక్ట్ కాజల్ చేతికి వచ్చింది. 

Kajal Agarwal New Glamour Look