Advertisementt

మట్టి వాసనతో బాక్సాఫీస్ వేట

Sat 11th Apr 2026 08:14 PM
thimmarajupalli tv  మట్టి వాసనతో బాక్సాఫీస్ వేట
Thimmarajupalli TV Movie మట్టి వాసనతో బాక్సాఫీస్ వేట
Advertisement
Ads by CJ

ఓ వైపు భారీ బడ్జెట్ పాన్-ఇండియా చిత్రాలతో ప్రపంచాన్ని ఆకర్షిస్తుంటే? మరోవైపు నవతరం మేకర్స్ మట్టి వాసన కలిగిన పల్లెటూరి కథలతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్నారు. ఒకప్పుడు గ్రామీణ కథలంటే కేవలం సెంటిమెంట్‌కే పరిమితమని భావించేవారు.  కానీ `బలగం`, `రాజు వెడ్స్ రాంబాయి` వంటి చిత్రాల ఘనవిజయం ఈ ధోరణిని మార్చేసింది. నేటి యువ తరం హీరోలు, దర్శకులు కొందురు విదేశీ లొకేషన్ల కంటే మన పచ్చని పొలాలనే తమ కథా వేదికలుగా ఎంచు కుంటున్నారు. నగర జీవితంలోని యాంత్రికతకు దూరంగా స్వచ్ఛమైన అనుబంధాలు, మట్టి మనుషుల జీవనశైలిని వెండితెరపై ఆవిష్కరించడం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తోంది.

ఈ క్రమంలోనే పలువురు యంగ్ స్టార్స్ తమ కంఫర్ట్ జోన్ దాటి రూరల్ డ్రామాల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మాస్ మహారాజా రవితేజ తమ్ముడి కుమారుడు మాధవ్ భూపతిరాజు `మారెమ్మ` అనే రా అండ్ రస్టిక్ తెలంగాణ నేపథ్య చిత్రంతో అరంగేట్రం చేస్తుండగా? యువ హీరో కిరణ్ అబ్బవరం `తిమ్మరాజుపల్లి` అనే రూరల్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. పల్లెటూరి రాజకీయాలు, సామాజిక అంశాల చుట్టూ తిరిగే ఈ కథలు కొత్త హీరోలు తమను తాము నిరూపించుకోవడానికి ఒక గొప్ప వేదికగా మారు తున్నాయి. ఇమేజ్ చట్రంలో ఇరుక్కోకుండా ఇలాంటి సహజసిద్ధమైన పాత్రలను ఎంచుకోవడం పరిశ్రమలో  సానుకూల పరిణామంగా కనిపిస్తోంది.

`బలగం`తో సంచలనం సృష్టించిన దర్శకుడు వేణు ఎల్దండి  తదుపరి చిత్రం `ఎల్లమ్మ`పై దృష్టి సారించాడు. దేవిశ్రీ ప్రసాద్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా గ్రామీణ సంస్కృతి, ఆచారాల చుట్టూ తిరిగే లోతైన భావోద్వేగాలతో రూపొం దుతోంది. భారీ గ్రాఫిక్స్ కంటే బలమైన కథలు, సహజత్వమే సినిమాలను గట్టెక్కిస్తాయని ఈ యంగ్ మేకర్స్ నిరూపిస్తున్నారు. ఇలాంటి చిత్రాలు కంటెంట్ పరంగానే కాకుండా బడ్జెట్ పరంగా కూడా నిర్మాతలకు లాభదాయకంగా మారుతు న్నాయి. తెలుగు సినిమా మళ్ళీ మూలాలను  వెతుక్కుంటూ గ్రామాల వైపు వెళ్లడం పరిశ్రమకు సరికొత్త ఊపిరి పోస్తోంది.

Thimmarajupalli TV Movie:

Thimmarajupalli TV

Tags:   THIMMARAJUPALLI TV
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ