Advertisementt

LIK - దాని కోసమే వెయిటింగ్

Sat 11th Apr 2026 03:34 PM
lik  LIK - దాని కోసమే వెయిటింగ్
LIK public talk LIK - దాని కోసమే వెయిటింగ్
Advertisement
Ads by CJ

కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన LIK లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ చిత్రం ఎన్నో సమస్యలను అధిగమించి నిన్న థియేటర్స్ లో విడుదలైంది. హ్యాట్రిక్ హిట్స్ తో ఉన్న ప్రదీప్ రంగనాథన్ ఈ LIK తో కూడా హిట్ కొట్టాడా అనే క్యూరియాసిటీ కన్నా ఎక్కువగా ఐరెన్ లెగ్ ముద్ర వేయించుకున్న కృతి శెట్టి కి ఈ LIK చిత్రం ఎలాంటి రిజల్ట్ ఇచ్చిందో అనే ఆత్రుత చాలామందిలో కనిపించింది.

నయనతార భర్త విగ్నేష్ శివన్ తెరకెక్కించిన LIK చిత్రం నిన్న ఏప్రిల్ 10 న విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ప్రేక్షకుల నుంచి క్రిటిక్స్ నుంచి LIK జస్ట్ యావరేజ్ మార్కులు వేయించుకుంది. ప్రదీప్ రంగనాథన్ తన పాత్రకు తగ్గట్లుగా నటించాడు. కాకపోతే తన గత చిత్రాల్లో ఉన్నంత ఎనర్జీ, ఛార్మ్ ఇందులో కనిపించవు. కృతి శెట్టి ఈ పాత్రకు సెట్ కాలేదని కొంతమంది.. కృతి శెట్టి పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది.. తన గ్రామర్ తో ఆకట్టుకుంటుంది అని కొంతమంది కామెంట్లు పెడుతున్నారు.

ఎస్ జె సూర్య-ప్రదీప్ కాంబో సీన్స్ బావున్నాయి. అలాగే విజువల్స్ మరియు సెటప్ చాలా రిచ్‌గా ఉన్నప్పటికీ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ రెండింటిలోనూ బాగా ల్యాగ్ ఉంది. సెకండ్ హాఫ్‌లో స్టోరీ కొంచెం సింపుల్‌గా అనిపించడం, స్క్రీన్‌ప్లే స్లో అవ్వడం వల్ల సినిమా గ్రిప్ తగ్గుతుంది. మరి ఈ వీకెండ్ పెరఫార్మెన్స్ ని బట్టి LIK హిట్టో లేదంటే ఫట్టో అనేది తేలిపోతుంది. 

LIK public talk:

LIK social media talk

Tags:   LIK
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ