పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ మార్చ్ 19 ఉగాది స్పెషల్ గా విడుదలైన మిక్స్డ్ టాక్, మిక్స్డ్ రివ్యూస్ తెచ్చుకోవడం, ధురంధర్ ద రివెంజ్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో.. ఉస్తాద్ భగత్ సింగ్ థియేటర్స్ లో అనుకున్న సక్సెస్ సాధించలేకపోయింది. దర్శకుడు హరీష్ శంకర్ ఎంతగా ప్రమోట్ చేసినా ధురంధర్ 2 ముందు ఉస్తాద్ తేలిపోయింది.
థియేటర్స్ లో అభిమానులను, ప్రేక్షకులను డిజప్పాయింట్ చేసిన ఉస్తాద్ భగత్ సింగ్ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఉస్తాద్ భగత్ సింగ్ ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఫ్యాన్సీ డీల్ తో దక్కించుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటించింది నెట్ ఫ్లిక్స్.
థియేటర్స్ లో విడుదలైన నాలుగు వారాల్లోపు అంటే ఏప్రిల్ 16వ తేదీ నుంచి ఉస్తాద్ ను నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఉస్తాద్ భగత్ సింగ్ తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోనూ స్ట్రీమింగ్ చేయనున్నట్లుగా అనౌన్స్ చేసారు.




పెద్దిపై కాక పెంచిన సినిమాటోగ్రాఫర్!

Loading..