నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK111 ప్రాజెక్ట్ షూటింగ్ లో ఉన్నారు. ఈరోజు శుక్రవారం గోపీచంద్ మలినేని, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే బాలయ్య ఈమధ్యన తెగ స్పీడు పెంచారు. ఒక ప్రాజెక్ట్ లైన్ లో ఉండగానే మరో ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించేస్తున్నారు.
ఇప్పుడు నందమూరి బాలకృష్ణ మరో యంగ్ డైరెక్టర్ విజయ్ కనకమేడలకు ఓకే చెప్పినట్లుగా తెలుస్తుంది. విజయ్ కనకమేడల NBK112 స్క్రిప్ట్ ప్రిపరేషన్ లో ఉన్నాడట, ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. బాలయ్య-విజయ్ కనకమేడల కాంబో జూన్ నుంచి రెగ్యులర్ షూట్ అంటున్నారు.
ఈ చిత్రంలో బాలయ్య డ్యూయెల్ రోల్ లో కనిపిస్తారని, అందులో ఒకటి పోలీస్ ఆఫీసర్ పాత్ర అని ప్రచారం జరుగుతుంది. అంతేకాదు అన్నీ కుదిరితే సంక్రాంతి రిలీజ్ అంటున్నారు.
గోపీచంద్ మలినేని చిత్రంతో పాటుగా బాలయ్య విజయ్ కనకమేడల చిత్ర షూటింగ్ ని ఒకేసారి చేస్తారట. విజయ్ తో మూవీ స్టార్ట్ అయ్యేసరికి గోపీచంద్ మలినేని సినిమాకు సంబందించిన రెండు మూడు షెడ్యూల్స్ పూర్తి చేస్తారని తెలుస్తుంది. ఇంకా అనౌన్సమెంట్ రాకుండానే విజయ్ కనకమేడల బాలయ్య మూవీ పట్టాలెక్కించేందుకు ఫుల్ స్వింగ్ లో పని చేస్తున్నాడన్నమాట.




రణ్వీర్ కు కోర్ట్ షాక్ 

Loading..