సినిమా పరిశ్రమలో నటి రెండు దశాబ్దాల పాటు తన స్టార్‌డమ్‌ను కాపాడుకోవడం అనేది అసాధారణమైన విషయం. 2005లో `చాంద్ సా రోషన్ చెహ్రా`తో కెరీర్‌ను ప్రారంభించి తెలుగులో `శ్రీ`చిత్రంతో అడుగుపెట్టిన తమన్నా భాటియా నేటికీ అగ్ర కథానాయికగా కొనసాగుతూ 20 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ మిల్కీ బ్యూటీగా ప్రేక్షకుల హృదయాల్లో చెదరని ముద్ర వేసింది. దక్షిణాది నుండి ఉత్తరాది వరకు అన్ని భాషల్లోనూ అగ్ర హీరోల సరసన నటించి తనకంటూ ప్రత్యేక సామ్రాజ్యాన్ని నిర్మించుకుంది.
తమన్నా కెరీర్‌లో `హ్యాపీ డేస్`, `100% లవ్`, `బాహుబలి` వంటి చిత్రాలు ఆమెను తిరుగులేని స్టార్‌గా నిలబెట్టాయి. ముఖ్యంగా `బాహుబలి`లో అవంతిక పాత్ర ఆమెలోని వీరనారిని ప్రపంచానికి పరిచయం చేసింది. మారుతున్న కాలానికి అనుగుణంగా తనను తాను మలుచుకోవడంలో తమన్నా ఎప్పుడూ ముందుంటుంది. వెండి తెరకే పరిమితం కాకుండా ఓటీటీ ప్లాట్‌ఫారమ్స్‌లోనూ విభిన్నమైన పాత్రలతో మెప్పిస్తూ సెకండ్ ఇన్నింగ్స్‌ను సైతం అత్యంత విజయవంతంగా కొనసాగిస్తుంది. ఆమె డ్యాన్స్ ప్రతిభ ,వృత్తి పట్ల ఉన్న అంకితభావం నేటి తరం నటీమణులకు ఒక పాఠం అని చెప్పవచ్చు.
ప్రస్తుతం తమన్నా కెరీర్‌లో పరిణతి చెందిన దశలో ఉంది. భాషా పరిమితులు దాటి పాన్-ఇండియా నటిగా ఎదిగిన తమన్నా గ్లామర్ ఇమేజ్‌ను పక్కన పెట్టి కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్‌లు , చాలెంజింగ్ రోల్స్‌పై దృష్టి సారిస్తుంది. రెండు దశాబ్దాల ప్రయాణం తర్వాత కూడా అదే ఉత్సాహంతో రెట్టింపు గ్లామర్‌తో దూసుకుపోతున్న ప్రస్థానం స్ఫూర్తి దాయకం. రాబోయే రోజుల్లో మరిన్ని వైవిధ్యమైన పాత్రలతో అమ్మడు భారతీయ చలనచిత్ర పరిశ్రమలో మరిన్ని రికార్డులు సృష్టించాలని ఆశీద్దాం. ప్రస్తుతం తమన్నా బాలీవుడ్ లో సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.




బిగ్ ట్విస్ట్ - మోనాలిసా భర్తపై పోక్సో కేసు

Loading..