జబర్దస్త్ కి నాగబాబు హెల్ప్ అయ్యారా..

Nagababu Re Entry in JabardasthNagababu Re Entry in Jabardasth


చాలా రోజులుగా ఈటివి లో ప్రసారమయ్యే కామెడీ షో మసక బారింది. టాప్ కమెడియన్స్ అందరూ ఒక్కొక్కరిగా జబర్దస్త్ కి దూరమవడం, జెడ్జి లుగా టాప్, క్రేజీ సెలబ్రిటీస్ లేకపోవడం, కామెడీ సరిగ్గా వర్కౌట్ అవ్వకపోవడం, సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సెర్స్ జబర్దస్త్ స్టేజ్ పై చేసే హడావిడి తప్ప జబర్దస్త్ లో ఇంట్రెస్టింగ్ గా ఏది కనిపించడమే లేదు.

దానితో మళ్లీ మల్లెమాల వాళ్ళు నాగబాబు ని జబర్దస్త్ స్టేజ్ పైకి తీసుకొచ్చారు. చాలా ఏళ్ళ తర్వాత నాగబాబు జబర్దస్త్ కు జెడ్జి గా రీ ఎంట్రీ ఇచ్చారు. నటి ఇంద్రజ తో కలిసి జెడ్జి గా ఉన్న నాగబాబు వల్ల ఈ కామెడీ షో కి మళ్లీ పూర్వ వైభవం వచ్చిందా, ఈ షో ని ఎంతమంది వీక్షిస్తున్నారు, అసలు జబర్దస్త్ రేటింగ్స్ ఎలా ఉన్నాయి అనే విషయంలో అందరిలో ఆసక్తి మొదలైంది.

నాగబాబు మాత్రం కమెడియన్స్ వేసే పంచ్ లకు పడి పడి నవ్వుతున్నారు. కానీ ఆ కామెడీలో అంత పస లేదు. కమెడియన్స్ కుళ్ళు జోకులకు నాగబాబు నవ్వినా ఆడియన్స్ కి అంత నవ్వు రావడం లేదు. మరి నాగబాబు జబర్దస్త్ కి ఏమైనా హెల్ప్ అయ్యారా లేదా అనేది తెలియాల్సిందే. 

Nagababu - Jabardasth