Loading...
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Honey Singh recreates life journey on stage

శిఖరం నుండి పాతాళానికి.. మళ్లీ ఫీనిక్స్ లా పైకి!

Honey Singh recreates life journey on stage

 

భారతీయ సంగీత ప్రపంచంలో ముఖ్యంగా రాప్ - పాప్ కల్చర్‌లో యో యో హనీ సింగ్ ఒక సంచలనం. దశాబ్దం క్రితం ఆయన సృష్టించిన మ్యూజికల్ వేవ్ బాలీవుడ్‌ను సైతం శాసించింది. ఆయన పాట లేనిదే ఏ పబ్, ఏ పార్టీ, ఏ క్లబ్ సాగేది కాదు. అంతటి అపూర్వమైన స్టార్‌డమ్.. కోట్లాది మంది అభిమానులు.. విపరీతమైన సంపాదన ఒకేసారి వచ్చి పడటంతో హనీ సింగ్ కెరీర్ పీక్స్‌కు చేరుకుంది. అయితే అంత వేగంగా వచ్చిన పాపులారిటీ  గ్లామర్ ప్రపంచంలోని వెలుగులు.. అంతే వేగంగా ఆయన వ్యక్తిగత జీవితాన్ని ఊహించని కల్లోలంలోకి నెట్టేసాయి.

సరిగ్గా కెరీర్ సక్సెస్ గ్రాఫ్ అద్భుతంగా ఉన్న తరుణంలోనే హనీ సింగ్ జీవితంలో చీకటి రోజులు ప్రారంభమయ్యాయి. విపరీతమైన స్టార్‌డమ్ తెచ్చిన ఒత్తిడిని తట్టుకోలేక ఆయన అల్కహాల్ .. డ్రగ్స్ వంటి తీవ్రమైన వ్యసనాలకు  బానిసయ్యారు. దీనికి తోడు మానసిక ఆరోగ్య సమస్యలు కూడా తోడుకావడంతో ఆయన చిత్ర పరిశ్రమకు, వెలుగుల ప్రపంచానికి పూర్తిగా దూరమయ్యారు. ఒకప్పుడు వేల మంది ప్రేక్షకుల ముందు స్టేజీలపై ఊగిపోయిన గ్లోబల్ స్టార్, నాలుగు గోడల మధ్య ఒక గదికే పరిమితమై, గుర్తుపట్టలేనంతగా శారీరక రూపాన్ని కోల్పోయి, ఇక కెరీర్ ముగిసిపోయిందనే స్థితికి చేరుకున్నారు.

కానీ పట్టుదల - సంకల్ప బలం ఉంటే ఎంతటి పాతాళం నుంచైనా తిరిగి ఫీనిక్స్ పక్షిలా పైకి రావచ్చు అని హనీ సింగ్ రియల్ లైఫ్ కమ్‌బ్యాక్  తో నిరూపించారు. సుదీర్ఘమైన చికిత్స, కౌన్సిలింగ్,  తన అంతర్గత పోరాటం తర్వాత ఆయన మళ్లీ శారీరకంగా, మానసికంగా కోలుకుని సంగీత ప్రపంచంలోకి రీ-ఎంట్రీ ఇచ్చారు. గ్లామర్  సక్సెస్ వెనుక ఉండే భయానక వాస్తవాలను ఆవిష్కరిస్తూ.. తన తప్పులను బహిరంగంగా ఒప్పుకుంటూ, మత్తు పదార్థాల వల్ల జీవితాలు ఎలా నాశనమవుతాయో ?యువతకు అవగాహన కల్పిస్తూ ఆయన సాగిస్తున్న  ద్వితీయార్థ ప్రయాణం ఎందరికో ఒక గొప్ప పాఠంగా నిలుస్తోంది.

Honey Singh brought his My Story tour to Mumbai