నిఖిల్ సిద్దార్థ్ లేటెస్ట్ మూవీ స్వయంభు రిలీజ్ డేట్ పై ఎడతెగని ఉత్కంఠ నడుస్తుంది. ఏప్రిల్ రిలీజ్ అంటూ స్వయంభు టీజర్ వదిలిన రోజు ప్రకటించిన టీమ్ ఇంకా పర్టిక్యులర్ డేట్ ఇవ్వకుండా ప్రేక్షకులను వెయిట్ చేయిస్తున్నారు. పాన్ ఇండియా మూవీ రిలీజ్ డేట్ లాక్ చెయ్యాలంటే మినిమమ్ రెండు నెలల సమయం కావాలి.
కానీ స్వయంభు మేకర్స్ మాత్రం సీజీ వర్క్ అంటూ కాలయాపన చేస్తున్నారు. ఇప్పుడు స్వయంభు ఫస్ట్ హాఫ్ సీజీ వర్క్ పూర్తి కాగా.. అది మేకర్స్ ని ఇంప్రెస్స్ చేసింది అని, ఇప్పుడు ఇక సెకండ్ హాల్ఫ్ సీజీ వర్క్ పూర్తి కావాల్సి ఉందట. మే 15 కల్లా అన్ని పనులు పూర్తి చెయ్యాలని మేకర్స్ టార్గెట్ గా పెట్టుకున్నారట.
ఇక ఇప్పుడు స్వయంభు మేకర్స్ ప్రముఖ ఓటీటీ సంస్థలైన Zee 5, నెట్ ఫ్లిక్స్ తో బేరాలు మట్లాడుకుని.. మే 22 స్వయంభు ని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం. మరి రిలీజ్ డేట్ ఎప్పుడైనా నిఖిల్ మాత్రం స్వయంభు ని హీరోయిన్స్ తో కలిసి తెగ ప్రమోట్ చేస్తున్నాడు.




నయనతార కోరిక తీరుతుందా.. 

Loading..