Advertisementt

డెకాయిట్ ప్రీమియర్ రివ్యూ

Fri 10th Apr 2026 07:59 AM
dacoit  డెకాయిట్ ప్రీమియర్ రివ్యూ
Dacoit Premiere Movie Review డెకాయిట్ ప్రీమియర్ రివ్యూ
Advertisement
Ads by CJ

అడివి శేష్ సినిమా వస్తుంది ప్రేక్షకుల్లో అటెన్షన్ అనిపిస్తుంది. గూఢచారి సమయంలోనే అడివి శేష్ సినిమా ఫస్ట్ డే చూసేందుకు ప్రేక్షకులు ఎంతగా ఇంట్రెస్ట్ చూపించారో చెప్పక్కర్లేదు. క్యూట్ లవ్ స్టోరీ చి.ల. సౌ ని పక్కనపెట్టి మరీ గూఢచారి కి వెళ్ళినవారు ఉన్నారు. అడివి శేష్ సినిమా అంటే ప్రేక్షకుల్లో ఓ విధమైన నమ్మకం వచ్చేసింది. అందులోను అన్నపూర్ణ స్టూడియోస్ అమ్మాయి సుప్రియ ప్రొడక్షన్ అంటే ఆడియన్స్ లో మరింత భరోసా కనిపిస్తుంది.

సుప్రియ యార్లగడ్డ ప్రొడక్షన్ లో అడివి శేష్ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్, అనురాగ్ కస్యప్, ప్రకాష్ రాజ్ లాంటి విలక్షణ నటులుతో  తెరకెక్కిన డెకాయిట్ చిత్రం ఏప్రిల్ 10 న థియేటర్స్ లో విడుదలైంది. డెకాయిట్ టీజర్, ట్రైలర్ అన్ని సినిమా హైప్ క్రియేట్ చెయ్యడమే కాదు టీమ్ ప్రమోషన్స్ కూడా సినిమాను చూడాలన్న ఆసక్తిని క్రియేట్ చేసాయి.

మరి నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన డెకాయిట్ ప్రెస్ ప్రీమియర్ టాక్ లోకి వెళితే.. అడివి శేష్ మాసివ్ లుక్ తో సినిమాని భుజాల పై మోశాడు అని చెప్పడంలో సందేహమే లేదు. అటు యాక్షన్, ఇటు ఎమోషనల్ సీన్స్ లో అడివి శేష్ నటనకు ఆడియన్స్ ముగ్దులవుతారు. మృణాల్ ఠాకూర్ కూడా కళ్ళతో భావోద్వేగాలను చూపించింది. ఫస్ట్ హాఫ్ లో థ్రిల్ చేసే సీన్స్ ఆకట్టుకున్నాయి.

అడివి శేష్ నటన, మృణాల్ ఠాకూర్ నటన, ఫస్ట్ హాఫ్, యాక్షన్ సీక్వెన్స్, మ్యూజిక్ డెకాయిట్ కి ప్లస్ కాగా.. అడివి శేష్ కథలో కొత్తదనమ్ లేకపోవడం, సెకండ్ హాఫ్ తేలిపోవడం, BGM ఇవి డెకాయిట్ కి మైనస్ గా నిలిచాయంటూ ప్రీమియర్ చూసిన వారు చేస్తున్న కామెంట్స్.

Dacoit Premiere Movie Review:

Adivi Sesh Dacoit Premiere Movie Review

Tags:   DACOIT
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ