పెద్ది లాస్ట్ మినిట్ వరకు టెన్షనే
Peddi Movie Update
జూన్ 4 న విడుదల కాబోతున్న పెద్ది చిత్రానికి లాస్ట్ మినిట్ వరకు టెన్షనే అనేట్టుగా కనిపిస్తుంది. పెద్ది పై హైప్ ఉంది, అంచనాలు ఉన్నాయి. అలాగే ఆంధ్ర లో టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కల్పిస్తారు. కానీ తెలంగాణ కు వచ్చేసరికి టికెట్ రేట్స్ హైక్ ఉంటుందా, ఉండదా అనేది ఇప్పుడు అందరిలో ఉన్న అనుమానం.
లాస్ట్ మినిట్ వరకు రేవంత్ రెడ్డి సర్కార్ పెద్ది టికెట్ రేట్ల విషయంలో మౌనంగానే ఉంటుంది. చివరి నిమిషంలో పెంచాక ఎవరైనా కోర్టుకు వెళితే అదో గందర గోళం. అంతేకాదు పెద్ది ప్రీమియర్స్ తెలంగాణాలో ఉంటాయా, దీనికి కూడా తెలంగాణ ప్రభుత్వం అనుమతినిస్తుందా, లేదా అనేది కూడా సస్పెన్స్.
ఇక ఇష్టం వచ్చినట్టుగా టికెట్ రేట్లు పెంచినా నిర్మాతలకు దెబ్బె.. రెండు మూడు రోజుల్లో ఆ పెరిగిన టికెట్ రేట్లు గిట్టుబాటు అయినా.. నాలుగో రోజు నుంచి థియేటర్ కి వెళ్లేందుకు ప్రేక్షకులు ఆలోచిస్తారు. ఇంత టికెట్ పెట్టుకుని చూడడం అవసరమా అని అంటారు, ఐదు వారాల్లో ఓటీటీ లోకి వచ్చే పెద్ది ని థియేటర్స్ లో డబ్బులు తగలేసుకుని చూడాలా అంటారు.
సో టికెట్ రేట్లు పెంచుకుంటే మూడు రోజులు నిర్మాతలకు లాభం కన్నా తర్వాత నష్టమే ఎక్కువ ఉంటుంది. ఓ మూడు రోజులు టికెట్ రేట్స్ హైక్ ఉంటె సరిపోతుంది.. లేదంటే అనేది నిర్మాతల ఆలోచనకే వదిలెయ్యాలి.







































