Loading...
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Hemanth Madhukar believes actress Triptii Dimri will surprise audience

స్పిరిట్: త్రిప్తి ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది

Hemanth Madhukar believes actress Triptii Dimri will surprise audience


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో కల్ట్ డైరెక్టర్ సందీప్ వంగ తెరకెక్కిస్తున్న స్పిరిట్ షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది. ఈ చిత్రంలో ప్రభాస్ కి జోడిగా దీపికా నటించాల్సింది, ఆమె ప్లేస్ లోకి త్రిప్తి డుమ్రి ని హీరోయిన్ గా ఎంపిక చేసారు. అయితే త్రిప్తి పాత్ర కేవలం గ్లామర్ కె పరిమితమనే ప్రచారాన్ని దర్శకుడు హేమంత్ మధుకర్ కొట్టిపారేశారు.

సందీప్ సినిమాల్లో హీరోయిన్స్ కేవలం గ్లామర్ కే పరిమితమవ్వదు. ఆయన హీరోయిన్స్ కి బలమైన పాత్రలు, అలాగే చాలా డిఫ్రెంట్ గా ఉండేలా రాస్తారు. అర్జున్ రెడ్డి లో షాలిని పాండే సింపుల్ గానే బోల్డ్ గా కనిపించినా ఆమె పాత్ర లో చాలా ఎమోషన్ ఉంటుంది. ఇక యానిమల్ లోను రష్మిక పాత్ర భర్తకు, కుటుంబానికి మధ్య జరిగే ఘర్షణలను తట్టుకునే ఒక బలమైన మహిళగా చూపించారు.

రణబీర్ కపూర్ పాత్రనే ముఖ్యమైనా రష్మిక తన నటన తో ఆకట్టుకుంది. ఇప్పుడు స్పిరిట్ లో త్రిప్తి డుమ్రి కూడా కేవలం గ్లామర్ కె పరిమితమవ్వదు. హీరో, విలన్ ఎంత పవర్ ఫుల్ గా ఉంటారో, సందీప్ సినిమాల్లో హీరోయిన్ పాత్రకు అంతే ప్రాధాన్యత ఉంటుంది. ఆమె ఖచ్చితంగా ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది. దీపికా ప్లేస్ లోకి త్రిప్తి వచ్చింది అనేది నేను పట్టించుకోను.

దర్శకుడు హీరోయిన్ పాత్రకు ఎవరు సరిపోతారో వారినే ఎంపిక చేసుకుంటారు. స్పిరిట్ లో త్రిప్తి అందరి అంచనాలు అందుకుంటుంది అని నేను మాత్రమే కాదు అందరూ నమ్ముతారు అంటూ ఆయన చెప్పుకొచ్చారు.

Hemanth Madhukar believes actress Triptii Dimri will surprise audiences with her role in Spirit