కోలీవుడ్ డైరెక్టర్ గా ప్రస్థానం మొదలు పెట్టి లవ్ టుడే తో హీరో అవతారమెత్తిన ప్రదీప్ రంగనాథన్ మొదటి సినిమాకే సూపర్ హిట్ కొట్టాడు. వీడేమిటి హీరో అనుకున్న వారికి షాకిస్తూ హ్యాట్రిక్ హిట్స్ ఖాతాలో వేసుకున్నాడు. లవ్ టుడే, ఎంటర్ ది డ్రాగన్, డ్యూడ్ చిత్రాలతో హీరోగా సత్తా చాటారు. మూడు చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి.
దానితో ప్రదీప్ రంగనాథన్ పై అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పుడు తాజాగా నయనతార భర్త, దర్శకుడు విగ్నేష్ శివన్ దర్శకత్వంలో LIK అంటూ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రమోషన్స్ చేస్తూ ప్రదీప్ రంగనాథన్ ఇంకా హీరోయిన్ కృతి శెట్టి లు LIK పై హైప్ క్రియేట్ చేస్తున్నారు.
LIK ట్రైలర్ చూసాక మళ్లి ప్రదీప్ రంగనాథన్ హిట్ కొట్టడం పక్కా అంటూ ఆడియన్స్ మాట్లాడుకుంటున్నారు. మరి హ్యాట్రిక్ హిట్స్ తో సక్సెస్ ఫుల్ హీరోగా కనిపిస్తున్న ప్రదీప్ రంగనాథన్ ఆ సక్సెస్ ని కంటిన్యూ చేస్తూ LIK తో హిట్ అందుకుంటాడా అనేది మరికొన్ని గంటల్లో తెలిసిపోతుంది.
అన్నట్టు ఈ చిత్రం పదే పదే పలుమార్లు వాయిదా పది ఫైనల్ గా ఏప్రిల్ 10 న విడుదలకు సిద్దమైంది.




ఆ సినిమాను ఏకంగా డిసెంబర్ కే తొసేస్తున్నారా..
Loading..