Advertisementt

డెకాయిట్ బ్లాక్ బస్టర్ నీకే సొంతం - సమంత

Thu 09th Apr 2026 01:30 PM
samantha  డెకాయిట్ బ్లాక్ బస్టర్ నీకే సొంతం - సమంత
Samantha bats for Dacoit డెకాయిట్ బ్లాక్ బస్టర్ నీకే సొంతం - సమంత
Advertisement
Ads by CJ

అక్కినేని వారి మాజీ కోడలు, ప్రముఖ హీరోయిన్ సమంత నాగ చైతన్య తో తప్ప మిగతా అక్కినేని ఫ్యామిలీ తో మంచి అనుబంధమే ఉంది తాజాగా సుప్రియ యార్లగడ్డ, నాగార్జున మేనకోడలు ప్రొడక్షన్ నుంచి వస్తున్న డెకాయిట్ టీమ్ కి ఆల్ ద బెస్ట్ చెబుతూ సమంత చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

సుప్రియ.. డెకాయిట్ కోసం నువ్వు పడిన కష్టం, నీ పట్టుదల, సినిమాపై నీకున్న అంకితభావం అన్నీ నేను స్వయంగా చూశాను. సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకోవడానికి నీకంటే ఎవరూ అర్హులు కారు. దేవుడి ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉండాలి అంటూ సమంత సుప్రియ కి అలాగే డెకాయిట్ టీమ్ కి బెస్ట్ విషెస్ అందజేసింది.

నాగార్జున కు కోడలిగా, నాగ చైతన్య కు భార్య గా అక్కినేని ఇంట అడుగుపెట్టిన సమంత ఆతర్వాత ఆ ఫ్యామిలీ లోని అందరితో మంచి అనుబంధాన్ని మైంటైన్ చేసింది. చైతు తో విడిపోయాక ఎవ్వరిని కలవకపోయినా ఇలా సోషల్ మీడియా ద్వారా ఆమె పోస్ట్ లు పెడుతుంది. 

Samantha bats for Dacoit:

Samantha wishes Dacoit makers

Tags:   SAMANTHA
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ