నీట్ లీక్ లో వేలు పెట్టినా క్లీన్ గానే!
Vishal Dadlani Reacts To Removed From Indian Idol 16 Over Remark On PM Modiబాలీవుడ్ సంగీత దర్శకుడు, గాయకుడు విశాల్ దద్లానీ సింగింగ్ రియాలిటీ షో `ఇండియన్ ఐడల్ 16` నుండి బహిష్కరణకు గురయ్యారంటూ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. దేశంలో సంచలనం సృష్టించిన నీట్-యుజి పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై ఆయన చేసిన రాజకీయ వ్యాఖ్యల వల్లే షో నిర్వాహకులు తప్పించాలనే నిర్ణయం తీసుకున్నారనే వార్తలు నెటిజన్లలో తీవ్ర చర్చకు దారితీశాయి.
అయితే ఈ వార్తలపై విశాల్ దద్లానీ తాజాగా స్పందించారు. `ఇండియన్ ఐడల్` సెట్స్ నుంచే చిత్రీకరించిన ఆ వీడియోలో.. ఆయన మొదట ఉద్యోగం పోయిందనే బాధతో ఏడుస్తున్నట్లు నటిస్తూ.. ఆ తర్వాత ఒక్కసారిగా గట్టిగా నవ్వుతూ `హియర్ ఐ యామ్, బేబీ! (నేను ఇక్కడే ఉన్నాను) అంటూ కెమెరా ముందుకు వచ్చారు. ఆన్‌లైన్‌లో కనిపించే ప్రతి విషయాన్ని గుడ్డిగా నమ్మకూడదని ఇంటర్నెట్‌లో సమాచారాన్ని విపరీతంగా మానిప్యు లేట్ చేస్తున్నారని ప్రచారాన్ని ఖండించారు.
ఇటీవల జరిగిన నీట్ పరీక్షల పేపర్ లీక్ ఘటనపై విశాల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఇలాంటి చెలగాటం ఆడటం తగదని, ఏ ప్రభుత్వ సంస్థ కూడా దీనికి పూర్తి బాధ్యత వహించకపోవడం విచారకరమని మండిపారు. దేశాన్ని సరైన మార్గంలో నడిపించాలంటే చదువుకున్న, సమర్థులైన నాయకులను ఎన్నుకోవాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. దీంతో షో నిర్వాహకులు ఆ ప్రభావం షోపై పడుతుందని తప్పించినట్లు నెట్టింట ప్రచారం రాగా దాన్ని ఖండించారు.
















































