Advertisementt

ర‌ష్మిక కెరీర్‌లో మ‌రో డిఫ‌రెంట్ రోల్

Wed 08th Apr 2026 07:33 PM
rashmika  ర‌ష్మిక కెరీర్‌లో మ‌రో డిఫ‌రెంట్ రోల్
Rashmika-Cocktail 2 ర‌ష్మిక కెరీర్‌లో మ‌రో డిఫ‌రెంట్ రోల్
Advertisement
Ads by CJ

కెరీర్ లో వ‌రుసగా వైవిధ్య‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తున్న ర‌ష్మిక మంద‌న్న మ‌రో ఆస‌క్తిక‌ర పాత్ర‌లో న‌టిస్తోంది. పుష్ప లో శ్రీ‌వ‌ల్లిగా మురిపించిన ర‌ష్మిక `యానిమ‌ల్` చిత్రంలో ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌తో ర‌క్తి క‌ట్టించింది. ఇప్పుడు ఆక‌తాయి అమ్మాయిగా కుర్ర‌త‌నాన్ని ప్ర‌ద‌ర్శించే చిల్లింగ్ గాళ్ పాత్ర‌తో మైమ‌రిపించ‌బోతోంది.

`కాక్ టైల్ 2` చిత్రంలో రష్మిక మందన్న పాత్ర అత్యంత కీలకమైనదని, తన నటనతో అద్భుతమైన గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా చిత్ర బృందంతో చక్కగా సింక్ అయి ప‌ని చేసిందని తెలుస్తోంది. తాజాగా విడుదలైన `జబ్ తలక్` పాటలో కృతి సనన్ గ్లామర్ పరంగా కాస్త ఎక్కువగా కనిపించినట్లు అనిపించినా.. రష్మిక తనదైన హ‌త్తుకునే నటనతో తన ఉనికిని చాటుకుంది. కృతి సనన్ తన ఇమేజ్‌తో డామినేట్ చేయాలని చూసినా.. రష్మిక ఇప్పటికే సంక్లిష్టమైన పాత్రలను పోషించి అద్భుతమైన నటిగా పేరు సంపాదించుకున్న నేపథ్యంలో త‌న‌ను పక్కకు పెట్టడం సాధ్యం కాదని అర్థమవుతోంది. పాట టీజర్‌లో రష్మిక ఎంతో స్టైలిష్‌గా, ఎనర్జిటిక్‌గా కనిపిస్తూ తన పాత్రలో పూర్తిగా లీనమై నటించింది.

ఈ చిత్రం జూన్ 19, 2026న విడుదల కానుంది. ఇందులో షాహిద్ కపూర్, కృతి సనన్, రష్మిక మందన్న ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్నారు. ముగ్గురు స్నేహితుల‌ మధ్య సాగే ప్రేమ, భావోద్వేగాల చుట్టూ ఈ కథాంశం తిరుగుతుంది. ప్రీతమ్ అందించిన సంగీతం మరియు అరిజిత్ సింగ్ గానం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

Rashmika-Cocktail 2:

Rashmika Mandanna -Cocktail 2

Tags:   RASHMIKA
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ