ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తారో.. సురేందర్ రెడ్డి తో ముందుకు వెళతారా.. దేవాకట్టా లైన్ లోకి వచ్చాడు అని ప్రచారం జరుగుతుంటే.. పవన్ కళ్యాణ్ టీమ్ మాత్రం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏ సినిమాలో నటించడం లేదు.. ఆయన చెప్పేవరకు ఏ వార్తలను నమ్మొద్దు అంటూ ప్రెస్ నోట్ వదిలారు.
అయితే ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా వున్న పవన్ కళ్యాణ్ ను మెగా 158 దర్శకుడు బాబీ కలవడం హాట్ టాపిక్ అయ్యింది. బాబీ పవన్ కళ్యాణ్ ని కలిసి ఆ ఫోటో షేర్ చేస్తూ..
ఆయన్ని కలవడానికి వెళుతున్నప్పుడు నాలో చిన్న ఉద్వేగం...
ఆయనతో పనిచేసిన టైములో అప్పుడే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వ్యక్తి. కానీ ఇప్పుడు...ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. నేను వెళ్ళేసరికి చిరునవ్వులు చిందిస్తున్న ఒక ఋషి లా కనిపించారు...
రాజకీయాల్లో తమ ఆస్తుల్ని పెంచుకున్న వ్యక్తుల గురించి విన్నాం, చూసాం... కానీ అన్ని సౌకర్యాలని వొదులుకొని నమ్మిన సిద్ధాంతం కోసం బతుకుతున్న ఆయన నాకు ఒక శిఖరం లా కనిపించారు.
అక్కడ ఉన్నంత సేపూ ఆయన నాపై చూపించిన ప్రేమకు ఫిదా అయిపోయాను.
చివరగా ఒక్క మాట చెబుతున్నాను...
జ్ఞానం కోసం రాజభోగాలు వదిలేసి అడవులు పట్టిన బుద్ధుడిని మనం చరిత్రలో చదువుకున్నాం...
జనం కోసం తన సుఖాలన్నీ వదులుకొని నిరంతరం శ్రమిస్తున్న కర్మయోగిని ఇవాళ చూశాను...
జైహింద్...
Love you always my POWER STAR @PawanKalyan అంటూ ట్వీట్ చేసారు.




సురేఖ కొణిదెల అతిథిగా కనక దుర్గ మూవీ పూజా 

Loading..