Advertisementt

నిర్మాత‌ల్ని హీరోలు అంత‌గా హింసిస్తారా..

Wed 08th Apr 2026 12:42 PM
naga vamsi  నిర్మాత‌ల్ని హీరోలు అంత‌గా హింసిస్తారా..
Naga Vamsi speech at Dacoit Event నిర్మాత‌ల్ని హీరోలు అంత‌గా హింసిస్తారా..
Advertisement
Ads by CJ

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న `డెకాయిట్` సినిమా ప్రమోషనల్ ఈవెంట్‌లో ప్ర‌ముఖ నిర్మాత‌ నాగవంశీ చేసిన వ్యాఖ్య‌లు హా*ట్ టాపిగ్గా మారాయి. ఈ చిత్రానికి సుప్రియ యార్లగడ్డ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సాధారణంగా వివాదాస్పద వ్యాఖ్యలు లేదా ముక్కుసూటి తనంతో మాట్లాడే నాగవంశీ ఈ వేదికపై సైలెంట్ గా పంచ్ లు విసిరారు.

సుప్రియ యార్లగడ్డను ఆటపట్టిస్తూ వంశీ కొన్ని పంచ్ లు విసిరారు. తాము ఇక్కడికి వచ్చింది సినిమాను పొగడటానికి కాదని.. సరదాగా వెక్కిరించడానికే వచ్చామని ఆయన చమత్కరించారు. అదే స‌మ‌యంలో సుప్రియ నిర్మించిన డెకాయిట్ పెద్ద విజ‌యం సాధించాల‌ని ఆకాంక్షించారు. అడివి శేష్ ఎంచుకునే కథలు వైవిధ్యంగా ఉంటాయని.. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

సినిమా ఇండస్ట్రీలో ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఒకరినొకరు ఆటపట్టించుకోవడం సహజమం. ఈ క్రమంలోనే సుప్రియ గురించి ఆయన చేసిన జోకులు వైరల్ అయ్యాయి. ముఖ్యంగా సుప్రియ పట్టుదలతో ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడంపై నాగ‌వంశీ ప్రశంసలతో పాటు కొన్ని చిలిపి విమర్శలు కూడా చేశారు.

హీరోల్ని నెత్తిన పెట్టుకుంటున్నారు! అంటూ క్లాస్...త‌మ‌ను తీస్కుంటుంద‌ని సుప్రియ‌పై పంచ్ వేసిన నాగ‌వంశీ..  రెండేళ్ల పాటు హీరో శేష్ కార‌ణంగా సుప్రియ‌ ఇబ్బందిప‌డ్డార‌ని... అలా ఇబ్బంది పెట్టినందుకు శేష్ కి థాంక్స్ చెప్పారు. బ‌య‌టి హీరోల‌తో సినిమాలు తీయ‌డం అంటే ఆషామాషీ వ్య‌వ‌హారం కాద‌ని కూడా నాగ‌వంశీ అన్నారు. సుప్రియ కూడా సొంత మావ‌య్య‌(నాగార్జున‌), త‌మ్ముళ్ల‌(సుమంత్ )తో సినిమాలు తీయ‌డం వ‌ల్ల బ‌య‌టి హీరోల‌తో వ్య‌వ‌హారం ఎలా ఉంటుందో తెలియ‌డం లేద‌ని.. తాను కూడా బ‌య‌టి హీరోల‌తో సినిమాలు తీసి క‌ష్ట‌ప‌డాల‌ని స‌ర‌దాగా వ్యాఖ్యానించారు. 

అయితే హీరోల కార‌ణంగా నిర్మాత‌ల‌కు కొన్నిసార్లు ఇబ్బందులు త‌ప్ప‌వు. కానీ వాట‌న్నిటినీ తెలివిగా మ్యానేజ్ చేసి సినిమా నిర్మాణం పూర్తి చేసి స‌జావుగా రిలీజ్ చేయాల్సి ఉంటుంది.

Naga Vamsi speech at Dacoit Event:

Director Naga Vamsi speech at Dacoit Pre Release Event

Tags:   NAGA VAMSI
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ