Advertisementt

సుప్రియ ని ఆట పట్టించిన నిర్మాత నాగవంశీ

Wed 08th Apr 2026 09:58 AM
naga vamsi  సుప్రియ ని ఆట పట్టించిన నిర్మాత నాగవంశీ
Naga Vamsi Big Satire on Supriya సుప్రియ ని ఆట పట్టించిన నిర్మాత నాగవంశీ
Advertisement
Ads by CJ

నాగార్జున మేనకోడలు, నటి కమ్ నిర్మాత సుప్రియను టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ నాగవంశీ, మైత్రి రవి ఆటపట్టించడం హాట్ టాపిక్ అయ్యింది. సుప్రియ నిర్మించిన డెకాయిట్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పలువురు నిర్మాతలు గెస్ట్ లుగా రాగా.. నాగవంశీ, రవి మాత్రం సుప్రియ ను సరదాగా ఆటపట్టించారు.

గిల్డ్ మీటింగుల్లో సుప్రియ నిర్మాత‌లంద‌రికీ క్లాస్‌లు పీకుతున్నార‌ని, ఇంత ఎందుకు ఖ‌ర్చు పెట్టారు, అలా ఎలా తీశారు? అని ఆరాలు తీస్తున్నార‌ని.. నాగవంశీ ఎప్పుడు చెబుతున్నాడు, అందుకే మా కష్టాలు ఎలా ఉంటాయో సుప్రియ కు ఇప్పుడు అర్ధమవుతుంది.. ఆమెకు ఆల్ ద బెస్ట్ చెప్పడానికన్నా ఆమె నిర్మాతగా పడే కష్టాన్ని చూసేందుకు ఈ ఈవెంట్ కి వచ్చాం అని మైత్రి రవి అన్నారు.

ఇక నాగవంశీ సుప్రియ గారు మమ్మల్ని ఇంత ఖర్చు పెట్టి తీస్తున్నారు, అంత ఖర్చు పెట్టి తీస్తున్నారు, హీరోలను నెత్తినెక్కించుకుంటున్నారు అంటూ క్లాసులు పీకే ఆవిడ ఇప్పుడు 2 ఇయర్స్.. 147 వర్కింగ్ డేస్ డెకాయిట్ సినిమా తీశారు. వాళ్ళ తమ్ముళ్లతో, మావయ్యతో సినిమాలు తీసి ఆమెకి నొప్పి తెలియలేదు. బయట హీరోలతో సినిమా తీస్తే తెలుస్తుంది ఎంత కష్టమో. సుప్రియా గారికి ప్రొడ్యూసర్ కష్టమేంటో చూపించిన శేష్ గారికి థాంక్స్, ఆవిడని ఏడిపించడానికే ఈ ఈవెంట్ కి వచ్చా అంటూ నాగవంశీ సుప్రియను ఈ సందర్భంగా ఆటపట్టించారు.

Naga Vamsi Big Satire on Supriya:

Producer Naga Vamsi Funny Comments on Supriya

Tags:   NAGA VAMSI
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ