డివైడ్ టాక్ తో ఇవేం కలెక్షన్స్ రా బాబు

Suriya Karuppu collections reportSuriya Karuppu collections report

 

టాలీవుడ్ లో క్రేజీ సినిమాలు లేక అల్లాడిపోతున్న ఆడియన్స్ కి డబ్బింగ్ సినిమాలు వరంలా మారాయి. వాటికి డివైడ్ టాక్ వచ్చినా పెద్ద హీరోలు అన్న కారణంగా ఆడియన్స్ థియేటర్స్ కి క్యూ కడుతున్నారా అనేలా రీసెంట్ గా విడుదలైన సూర్య వీరభద్రుడు, మోహన్ లాల్ దృశ్యం చిత్రాలను తెగ ఆదరించేస్తున్నారు ప్రేక్షకులు.

సూర్య కరుప్పుకి మిక్స్డ్ రెస్పాన్స్ రాగా.. మోహన్ లాల్ దృశ్యం3 చిత్రానికి డివైడ్ టాక్ వచ్చింది. మొదటిరోజు ఈ రెండు సినిమాలను వీక్షించిన ఆడియన్స్ తో పాటుగా క్రిటిక్స్ మిక్స్డ్ రెస్పాన్స్ చూపించారు. అయినప్పటికి ఈ రెండు సినిమాలకు తెలుగు బాక్సాఫీసు వద్ద కలెక్షన్స్ జోరు చూస్తే షాకవ్వాల్సిందే.

సూర్య వీర భద్రుడు చిత్రానికి రెండో వారంలోను థియేటర్స్ కళకళలాడుతున్నాయి. మోహన్ లాల్ సస్పెన్స్ థ్రిల్లర్ దృశ్యం 3 కి కూడా ఆడియన్స్ రాక ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ రెండు చిత్రాల కలెక్షన్స్ చూసిన వారు డివైడ్ టాక్ తో ఇవేం కలెక్షన్స్ రా బాబు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Mohanlal Drishyam 3 Collections report