ప్రస్తుతం వారణాసి మూవీ షూటింగ్ లో రాజమౌళి అండ్ టీమ్ తలమునకలై ఉంది. సరిగ్గా ఈరోజు ఏప్రిల్ 7 కి వారణాసి సినిమా రిలీజ్ ఏడాది అంటే 365 రోజులు ఉన్నట్లుగా కౌన్ డౌన్ అంటూ ప్రకటించారు మేకర్స్. అయితే ఈ చిత్రంలో మహేష్ బాబు ఓ ఎపిసోడ్ లో రాముడి గెటప్ లో కనిపిస్తారని, రాజమౌళి మహేష్ రాముడి గెటప్ అద్భుతంగా ఉంది అంటూ ఎప్పుడో రివీల్ చేసారు.
అయితే రామాయణ గ్లింప్స్ పై సోషల్ మదిలో వస్తున్న నెగెటివిటి చూసాక మహేష్ ఫ్యాన్స్ లో మహేష్ ని రాముడి గెటప్ లో చూడాలనే కోరిక, ఆత్రుత ఎక్కువైంది. వారణాసిలో సూపర్ స్టార్ రాముడిగా ఎలా ఉండబోతున్నారో అనే క్యూరియాసిటిలో ఉన్న అభిమానులు ఆ రాముడి పాత్ర తాలూకా లుక్ ని ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా ఇవ్వమంటున్నారు.
అది కృష్ణ బర్త్ డే మే 31న అయితే బావుంటుంది, కాదు అంటే ఆగష్టు 9 సూపర్ స్టార్ మహేష్ బర్త్ డే రోజు కానీ రివీల్ చెయ్యమని అడుగుతున్నారు. మరి రాజమౌళి అభిమానుల కోరికను మన్నిస్తారో లేదంటే సిల్వర్ స్క్రీన్ పై మహేష్ రాముడి గా కనిపిస్తే ఆ థ్రిల్లే వేరు అని అప్పటివరకు బయటకు రాకుండా జాగ్రత్త పడతారో చూడాలి.




అనిల్ రావిపూడి ప్రయోగశాల 

Loading..