Advertisementt

రూమర్స్ పై త్రిష మాస్ కౌంటర్

Tue 07th Apr 2026 02:17 PM
trisha  రూమర్స్ పై త్రిష మాస్ కౌంటర్
Trisha strongly reacted to the ongoing rumours రూమర్స్ పై త్రిష మాస్ కౌంటర్
Advertisement
Ads by CJ

హీరోయిన్ త్రిష సినిమాలకు గుడ్ బై చెప్పబోతోంది, హీరో విజయ్ TVK పార్టీలో జాయిన్ కాబోతుంది.. ఆమెకు విజయ్ తో పెళ్లి కూడా జరగబోతుంది. అందుకే విజయ్-సంగీత కోర్టు కెళ్లారు విడాకుల కోసం అంటూ ఇలా త్రిష పై చాలారకాల వార్తలు వినబడుతూనే ఉన్నాయి. అలాగే ఆమె కొత్త ప్రాజెక్ట్స్ ఒప్పుకోవట్లేదు. కారణం విజయ్ నే అంటూ రకరకాల వార్తలు ప్రచారం లోకి వచ్చాయి.

తాజాగా ఈ రూమర్స్ పై త్రిష మాస్ వార్నింగ్ ఇచ్చింది. తనపై నెగిటివిటి స్ప్రెడ్ చేసే వారికి త్రిష కౌంటర్ వేస్తూ.. నేను సినిమాలకు గుడ్‌బై చెప్పేశానట.. అంతేకాదు ఓ రిచ్ బిజినెస్‌మెన్‌ను పెళ్లి చేసుకున్నానట.. అందుకు సాక్ష్యంగా  మాకు పుట్టిన నలుగురు పిల్లలకు నిన్నే రెండేళ్లు కూడా నిండాయట.

ఇవి సరిపోతాయా.. లేదంటే ఇవి కాకుండా ఇంకేమైనా కొత్తవి జత చేయాలా.. లేదంటే ఈ రోజుకి ఈ కల్పిత వార్తల కోటా పూర్తయిందా అంటూ త్రిష తనపై వస్తున్న రూమర్స్ పై అగ్గిమీద గుగ్గిలమవుతూ సోషల్ మీడియాలో రూమర్స్ రాయుళ్లకు మాస్ కౌంటర్ ఇచ్చింది.

Trisha strongly reacted to the ongoing rumours :

Trisha Krishnan strongly reacted to the ongoing rumours about her marriage

Tags:   TRISHA
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ