బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన `క్వీన్` చిత్రానికి సీక్వెల్ రాబోతుందనే వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇందులో కంగనా రనౌత్ నటిస్తుందా ? లేదా? అనే అంశంపై అభిమానుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దర్శకుడు వికాస్ బాల్ ఇప్పటికే సీక్వెల్ స్క్రిప్ట్‌పై కసరత్తు పూర్తి చేశారని కంగనా కూడా ప్రాజెక్ట్ పట్ల ఆసక్తిగా ఉన్నారని సమాచారం. రాణి పాత్రలో ఆమె నటన అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. దీంతో ఆమె లేకుండా `క్వీన్ 2` ఊహించుకోవడం కష్టమని అభిమానులు భావిస్తున్నారు.
ప్రస్తుతం కంగనా రనౌత్ రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల సినిమా పట్టాలెక్కడంపై కొన్ని సందేహాలు వ్యక్తమవు తున్నాయి. అయినప్పటికీ మంచి కథాంశం దొరికితే ఖచ్చితంగా సెకండ్ పార్ట్ చేస్తానని ఆమె గతంలోనే ప్రకటిం చారు. మొదటి భాగం ముగిసిన చోటు నుండే రెండో భాగం కథ ప్రారంభమవుతుందని రాణి జీవితంలో వచ్చే తదుపరి మార్పులను ఇందులో చూపించబోతున్నారని తెలుస్తోంది. అయితే ఈ కథ పూర్తిగా భారత్ లో నే మెట్రో పట్టణాల నేపథ్యంలో సాగుతుంది. కంగనా డేట్స్ సర్దుబాటు పై త్వరలోనే క్లారిటీ రానుందని సమాచారం.
`క్వీన్ 2` విషయంలో చిత్ర యూనిట్ నుండి ఇంకా పూర్తిస్థాయి స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ కంగనా ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆమె కెరీర్‌లోనే మరో మైలురాయిగా నిలవడం ఖాయం. మరోవైపు మేకర్స్ కూడా ఒరిజినల్ ఫ్లేవర్ దెబ్బతినకుండా ఉండేందుకు కంగనానే హీరోయిన్‌గా కొనసాగించాలని పట్టుదలతో ఉన్నారు. త్వరలోనే ఈ క్రేజీ సీక్వెల్‌పై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.




హీరో శర్వానంద్ పై ట్రోల్స్ 

Loading..