ఇండియా కంటే ఓవర్సీస్‌లోనే జోరు!
Drishyam 3 Overseas collection report
అత్యంత ప్రజాదరణ పొందిన సస్పెన్స్ థ్రిల్లర్ ఫ్రాంచైజీగా `దృశ్యం’`ప్రత్యేక ముద్ర వేసుకుంది. మోహన్‌లాల్ -దర్శకుడు జీతూ జోసెఫ్ కాంబినేషన్‌లో రిలీజ్ అయిన క్రేజీ సిరీస్‌కు గ్లోబల్ వైడ్‌గా ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సిరీస్ మూడవ భాగం `దృశ్యం` అంతర్జాతీయ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలైన రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 76 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేసింది. జార్జ్‌కుట్టి అనే పాత్ర చుట్టూ అల్లిన మైండ్ గేమ్ ప్రేక్షకులను మరోసారి థియేటర్లలో ఏ విధంగా కట్టిపడేస్తోందో వసూళ్లు నిరూపిస్తున్నాయి.
అయితే ఈ సినిమా బాక్సాఫీస్ రన్ లో ఓఆసక్తికరమైన ట్రెండ్ కనిపిస్తోంది. సాధారణంగా భారతీయ చిత్రాలకు స్వదేశంలోవచ్చే వసూళ్లు ఎక్కువగా ఉంటాయి. కానీ `దృశ్యం 3` విషయంలో మాత్రం సీన్ రివర్స్ అయింది. ఈ చిత్రం భారతదేశం కంటే ఓవర్సీస్ మార్కెట్లలోనే అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తూ దూసుకుపోతోంది. మలయాళ చిత్రాలకు గల్ఫ్ దేశాలతో పాటు యూఎస్, యూకేలలో ఉండే బలమైన మార్కెట్ ,అక్కడి ప్రవాస భారతీయులు ఈ సస్పెన్స్ డ్రామాను చూడటానికి భారీగా థియేటర్లకు తరలిరావడమే ఇందుకు ప్రధాన కారణం. ఓవర్సీస్ వసూళ్లు దేశీయ వసూళ్లను స్పష్టమైన తేడాతో అధిగమించడం ఈ ఫ్రాంచైజీకి అంతర్జాతీయంగా ఉన్న తిరుగులేని బ్రాండ్ వాల్యూను స్పష్టం చేస్తోంది.
`దృశ్యం ` సాధిస్తున్న ఈ భారీ కలెక్షన్లు మోలీవుడ్ స్టామినాను గ్లోబల్ లెవెల్‌కు తీసుకువెళ్లాయి. భారీ బడ్జెట్ యాక్షన్ హంగులు, గ్రాఫిక్స్ లేకపోయినా.. బలమైన కథనం, ఉత్కంఠభరితమైన స్క్రీన్‌ప్లే ఉంటే ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల వసూళ్లు రాబట్టవచ్చని ఈ చిత్రం మరోసారి నిరూపించింది. రాబోయే రోజుల్లో లాంగ్ రన్‌లో ఈ సినిమా మరిన్ని మైలురాళ్లను అధిగమించి మలయాళ సినిమా చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన ల్యాండ్‌మార్క్ చిత్రాలలో ఒకటిగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.







































