Advertisementt

రిలీజ్ విషయం క్లారిటీ రాదా నిఖిల్

Mon 06th Apr 2026 09:17 AM
swayambhu  రిలీజ్ విషయం క్లారిటీ రాదా నిఖిల్
Swayambhu Movie Release Update రిలీజ్ విషయం క్లారిటీ రాదా నిఖిల్
Advertisement
Ads by CJ

కార్తికేయ 2 తర్వాత అంతే ఇమ్మిడియట్ గా పాన్ ఇండియా ఎంటర్టైన్ తో వస్తాడు అనుకుంటే.. నిఖిల్ అనౌన్స్ చేసిన స్వయంభు షూటింగ్ జరుపుకుంటూ అలా అలా ఈ ఏడాదికి రిలీజ్ కి రెడీ అయ్యింది. స్వయంభు టీజర్ తో సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచిన చిత్ర బృందం స్వయంభు రిలీజ్ విషయంలో తర్జన భర్జన పడుతుంది.

ఏప్రిల్ రిలీజ్ అంటూ ఊరించిన స్వయంభు మేకర్స్ ఏప్రిల్ లో స్వయంభు ని తెచ్చే విషయంలో ఎందుకో చాలా ఆలోచన చేస్తున్నారు. ఏప్రిల్ 10 అని కమిట్ అయిన స్వయంభు మేకర్స్ ఏప్రిల్ 30 పై కన్నేసారు. కానీ పెద్ది రిలీజ్ తేదీ విషయంలో సస్పెన్స్ నడవడం స్వయంభు కి అడ్డంకిగా మారింది.

అటు హీరో నిఖిల్ మాత్రం తన హీరోయిన్స్ సంయుక్త మీనన్, నభ నటేష్ లను తీసుకుని స్వయంభు ని ప్రమోట్ చేస్తున్నారు. కాలేజ్ ఫెస్ట్ లు, స్టార్ మా పరివార్ అవార్డ్స్, ఇతర షోస్ లో నిఖిల్ తెగ హడావిడి చేస్తున్నా స్వయంభు రిలీజ్ తేదీ మాత్రం ఇవ్వకుండా ఇంకా కన్ఫ్యూజ్ చేస్తున్నారు.

Swayambhu Movie Release Update:

Swayambhu Movie

Tags:   SWAYAMBHU
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ