Advertisementt

ధురంధర్-2పై పాక్ ప్రధాని కామెంట్

Sun 05th Apr 2026 07:49 PM
dhurandhar 2  ధురంధర్-2పై  పాక్ ప్రధాని కామెంట్
Pakistan Prime Minister comment on Dhurandhar-2 ధురంధర్-2పై పాక్ ప్రధాని కామెంట్
Advertisement
Ads by CJ

బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ `ధురంధర్-2` చిత్రానికి సరిహద్దుల అవతల నుండి అనూహ్యమైన స్పందన లభిస్తోంది. పాకిస్థాన్‌లో ఈ సినిమాపై నిషేధం ఉన్నా ఆ దేశ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రత్యేకంగా ఈ చిత్రం కాపీని తెప్పించుకుని వీక్షించారని పాక్ జర్నలిస్ట్ ఖలీద్ మెహమూద్ ఖలీద్ వెల్లడించారు. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో తనను స్ఫూర్తిగా తీసుకుని తీర్చిదిద్దిన పాత్రను నవాజ్ షరీఫ్ ఎంతో అభినందించారని ఖలీద్ తన ఎక్స్ (X) ఖాతా ద్వారా పేర్కొన్నారు. సినిమాలో తన పాత్రను మషూర్ అమ్రోహి పోషించగా.. ఆ పాత్ర‌ను చిత్రీకరించిన‌ విధానం షరీఫ్‌కు బాగా నచ్చిందని ఆయన స్పష్టం చేశారు.

పాక్ రాజకీయ వర్గాల్లో ఈ సినిమా గురించి ఆసక్తికర చర్చ జరుగుతుండగా.. జర్నలిస్ట్ ఖలీద్ ఈ విషయాన్ని నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం నవాజ్‌ను ట్యాగ్ చేస్తూ షేర్ చేయ‌డం విశేషం. తాను కూడా లాహోర్‌లో ఈ సినిమా విడుదలైన రోజే చూశానని.. సినిమాలోని కొన్ని క్లిప్పులను కూడా గతంలోనే షేర్ చేశానని ఆయన గుర్తు చేశారు. వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన ఈ స్పై థ్రిల్లర్.. వివాదాలకు అతీతంగా పాక్ అగ్రనేతను ఆకట్టుకోవడం ఇప్పుడు ఇరు దేశాల సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఒక దేశం నిషేధించిన చిత్రాలను అదే దేశపు అగ్రనేతలు రహస్యంగా వీక్షించడం అభినందించడం అనేది సదరు చిత్రాలలోని `వాస్తవికత` న‌చ్చింద‌ని అనుకోవాలా?  లేక సినిమాటిక్ లిబ‌ర్టీని గౌర‌వించ‌డం అని భావించాలా?

Pakistan Prime Minister comment on Dhurandhar-2:

Nawaz Sharif greatly appreciated his role in Dhurandhar 2

Tags:   DHURANDHAR 2
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ