అందానికే అర్ధం చెబుతున్న బ్యూటీ

యూట్యూబర్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఆనంద దేవరకొండ తో బేబీ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన వైష్ణవి చైతన్య.. ఆ చిత్రంలో నెగెటివ్ రోల్ చేసినా ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఆ చిత్రం తర్వాత వైష్ణవి చైతన్య కు వరస ఆఫర్స్ వచ్చినా అవి ఆమెను బాగా డిజప్పాయింట్ చేసాయి. ట్రెడిషనల్ కి కేరాఫ్ గా కనిపించే వైష్ణవి చైతన్య గ్లామర్ డోర్స్ ఎత్తింది.
మోడ్రెన్ అవతరమెత్తి అవకాశాలు రాబడుతుంది. ప్రస్తుతం కోలీవుడ్ లోకి ఎంటర్ అయిన వైష్ణవి చైతన్య సోషల్ మీడియా లుక్స్ అభిమానులను చాలా ఇంప్రెస్స్ చేస్తుంటాయి. తాజాగా వైష్ణవి చైతన్య షేర్ చేసిన శారీ లుక్ చూస్తే వావ్ బ్యూటిఫుల్ అంటూ నెటిజెన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
అంతేకాదు అందానికి అర్ధం చెబుతున్న బేబీ అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ట్రాన్స్పరెంట్ డిజైనర్ శారీ లో స్లీవ్ లెస్ డిజైనర్ బ్లౌజ్ లో వైష్ణవి చైతన్య సింపుల్ జ్యువలరీతో కనిపించినా అందంగా ఆకర్షణగా అనిపించింది. ప్రస్తుతం వైష్ణవి లేటెస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.







































