Loading...

ఈ శుక్రవారం కూడా తేలిపోయింది


గత కొన్ని శుక్రవారాలుగా ఇదే జరుగుతుంది. వారం వారం చిన్న సినిమాలు రావడం అవి డిజప్పాయింట్ చెయ్యడం అనేది పరిపాటి అయ్యింది. గత శుక్రవారం విడుదలైన డబ్బింగ్ మూవీ వీరభద్రుడు తెలుగు ప్రేక్షకులకు అనలేదు. ఇక ఈ వారం విడుదలైన నాలుగైదు సినిమాలు అదే రీతిలో ప్రేక్షకులను నిరాశపరచడంలో పోటీపడ్డాయి.

ఈ వారం విడుదలైన మలయాళ డబ్బింగ్ మూవీ దృశ్యం 3 తెలుగు ఆడియన్స్ ని ఇంప్రెస్స్ చెయ్యలేకపోయింది. అలాగే పురుషః, అవికా గోర్-నందు అగ్లీ స్టోరీ, రమణి కళ్యాణం లాంటి చిన్న చిత్రాలు భారీ ప్రమోషన్స్ చేసినా వాటికి మినిమమ్ ఓపినింగ్స్ కూడా దక్కలేదు. సరే కనీసం హిట్ టాక్ అయినా వచ్చిందా..

అదీ లేదు. ఈ వారం విడుదలైన చిన్న సినిమాల వంక ప్రేక్షకులు చూడలేదు సరికదా అవి కూడా నిరాశపరిచే ఫలితాలతో ఈవారం కూడా ఉసూరుమనిపించాయి. మరి మే చివరి వారం ఎలా ఉన్నా జూన్ మొదటివారంలో రామ్ చరణ్ పెద్ది నే అటు థియేటర్స్ ని ఇటు ఆడియన్స్ ని సేవ్ చెయ్యాలి 
 

MoviesFriday Movies