Advertisementt

ఫైనల్ స్టేజ్ లో వారణాసి

Sun 05th Apr 2026 08:59 AM
varanasi  ఫైనల్ స్టేజ్ లో వారణాసి
Varanasi shooting update ఫైనల్ స్టేజ్ లో వారణాసి
Advertisement
Ads by CJ

దర్శకధీరుడు రాజమౌళి వారణాసి షూటింగ్ ని చాలా ఫాస్ట్ గా ఫినిష్ చేస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7 వారణాసి రిలీజ్ అని చెప్పడమే కాదు దానికి అనుగుణంగా వారణాసి షూటింగ్ ని చకచకా ఫినిష్ చేస్తున్నారు. ప్రస్తుతం వార‌ణాసికి సంబంధించిన కీల‌క షెడ్యూల్ హైద‌రాబాద్ లోని శంక‌ర‌ప‌ల్లిలో జ‌రుగుతోంది.

ఈ షెడ్యూల్ లో సూపర్ స్టార్ మ‌హేష్‌, ఫృథ్వీరాజ్‌ సుకుమారన్ తో పాటు ప్రియాంక చోప్రా కూడా పాల్గొంటున్నారు. నిన్న శనివారమే ప్రియాంక చోప్రా వారణాసి కి సంబందించిన కీ షెడ్యూల్ లో జాయిన్ అయ్యింది. ఇప్ప‌టి వ‌ర‌కూ వారణాసి 80 శాతం షూటింగ్ పూర్త‌యిపోయిన‌ట్టే అని తెలుస్తుంది.

ఈ షెడ్యూల్ త‌ర‌వాత చిత్ర బృందం ముఖ్యంగా దర్శకుడు రాజమౌళి ఫ్యామిలీ, సూపర్ స్టార్ మహేష్ లు ఓ చిన్న బ్రేక్ తీసుకోబోతున్నారు. ఈ బ్రేక్ లో మ‌హేష్ ఫ్యామిలీతో విదేశాల‌కు వెళ్తారు. అంతేకాదు రాజ‌మౌళి త‌న కుటుంబంతో విహార యాత్ర‌కు వెళ్ల‌బోతున్నారు. వారు విదేశాల నుంచి తిరిగొచ్చాక తిరిగి షూటింగ్ మొదలవుతుంది.

మరి ఈలెక్కన జులై లేదా ఆగష్టు కల్లా రాజమౌళి వారణాసి షూటింగ్ ఫినిష్ చేసి మిగతా సమయాన్ని పోస్ట్ ప్రొడక్షన్ కి కేటాయిస్తారు. సో అనుకున్న సమయానికి వారాణసి విడుదల ఉంటుంది. 

Varanasi shooting update:

Varanasi movie

Tags:   VARANASI
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ