AK 47లోకి ఎంటర్ అవుతున్న హీరోయిన్

Nivetha Pethuraj Joins AK47Nivetha Pethuraj Joins AK47


త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ నటిస్తున్న చిత్రం ఆదర్శ కుటుంబం - హౌస్ నం: 47. ఈ చిత్రంలో వెంకీ ఫ్యామిలీ మ్యాన్ గా కనిపించబోతున్నారు. ఫుల్ స్వింగ్ లో హైదరాబాద్, దుబాయ్ తదితర ప్రాంతాల్లో వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి ఏ చిన్న అప్ డేట్ కనిపించినా అది సోషల్ మీడియాలో అది క్షణాల్లో వైరల్ అవుతోంది.

ఈ చిత్రంలో వెంకటేష్ కి జోడిగా హీరోయిన్ నివేద పేతురేజ్ నటించబోతున్నట్టుగా తెలుస్తుంది. గత రెండేళ్లుగా టాలీవుడ్ లో కనిపించని ఈ తార గతంలో త్రివిక్రమ్ సినిమా అలా వైకుంఠపురంలో సెకండ్ హీరోయిన్ గా చిన్న పాత్రకు పరిమితమయ్యింది. కానీ ఈసారి త్రివిక్రమ్ ఆ హీరోయిన్ కి న్యాయం చేస్తున్నారట.

అంటే వెంకీ సరసన ఫుల్ లెంత్ రోల్ కోసమే నివేద పెత్తురాజ్ ని త్రివిక్రమ్ ఆదర్శ కుటుంబం కోసం ఎంపిక చేసారని తెలుస్తుంది. సో వెంకీ సరసన నివేద హీరోయిన్ అనే అఫీషియల్ ప్రకటన త్వరలోనే రాబోతున్నట్టుగా తెలుస్తుంది. 

Nivetha Pethuraj ,