Advertisementt

ఒకే ఏడాది అన్నదమ్ములు కొట్టారుగా హిట్లు

Sat 04th Apr 2026 05:56 PM
santosh shobhan  ఒకే ఏడాది అన్నదమ్ములు కొట్టారుగా హిట్లు
Hero Santosh Shobhan ఒకే ఏడాది అన్నదమ్ములు కొట్టారుగా హిట్లు
Advertisement
Ads by CJ

సంతోష్ శోభన్-సంగీత్ శోభన్ ఇద్దరూ ఈ ఏడాది మంచి హిట్లు అందుకున్నారు. ఫిబ్రవరి 14 వాలంటైన్స్ డే సందర్భంగా క్యూట్ లవ్ స్టోరీ కపుల్ ఫ్రెండ్లి చిత్రంతో అన్న సంతోష్ శోభన్ డీసెంట్ హిట్ అందుకున్నాడు. థియేటర్స్ లో హిట్ అయిన ఈచిత్రం ఓటీటీలోనూ మంచి టాక్ సంపాదించింది.

ఇక తమ్ముడు సంగీత్ శోభన్ వంతు. మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ చిత్రాలతో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న సంగీత్ శోభన్ ఇప్పుడు రాకాస లాంటి డిఫరెంట్ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఫ్యామిలీ ఆడియన్స్ రాకాస చిత్రం బావుంది అనడమే కాదు క్రిటిక్స్ కూడా సంగీత్ శోభన్ చిత్రానికి మంచి రివ్యూస్ ఇచ్చారు.

2026 శోభన్ ఫ్యామిలీకి బాగా కలిసొచ్చింది. అన్నదమ్ములిద్దరూ సక్సెస్ ట్రాక్ ఎక్కారు. కేవలం నెలన్నర గ్యాప్ లో అన్నదమ్ములిద్దరూ బ్యాక్ టు బ్యాక్ హిట్ కొట్టారు. అన్న సంతోష్ శోభన్ కపుల్ ఫ్రెండ్లి తోనూ, సంగీత్ శోభా రాకాస చిత్రాలతో ఆడియన్స్ ను అలరించారు . 

Hero Santosh Shobhan:

Hero Sangeeth Shobhan

Tags:   SANTOSH SHOBHAN
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ