ప్రతి ఫ్రైడే ఇలా అయితే ఎలా

గత కొన్ని వారాలుగా బాక్సాఫీసు నిస్తేజంగా మారింది. ప్రేక్షకుల కిలకిలలు, బాక్సాఫీసు గలగలలు వినిపించి చాలా కాలం అయ్యింది. సంక్రాంతి తర్వాత మీడియం రేంజ్ సినిమాలు ప్రేక్షకులను పలకరించినా అవి పూర్తిగా న్యాయం చేయలేకపోయాయి. యావరేజ్ టాక్ తో సర్దుకుపొమ్మన్నాయి.
మే నెల అయితే చెప్పక్కర్లేదు.. పిల్లలకు సెలవులు వచ్చాయి, పాపం అని కూడా కనికరం లేదు. చిన్న సినిమాలు తప్ప మీడియం రేంజ్ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు. వారం వారం చిన్న సినిమాల విడుదలతో బాక్సాఫీసు కళ తప్పింది. ఈ వారం దృశ్యం 3 డబ్బింగ్ మూవీ ఆల్రెడీ నిరాశపరిచింది. ఇక మిగిలిన చిత్రాల సంగతి చూద్దాం.
ఈ శుక్రవారం పురుషః, రమణి కళ్యాణం, అగ్లీ స్టోరీ, ఫస్ట్ టైం లాంటి చిన్న చిత్రాలు విడుదలవుతున్నాయి. ఈ చిత్రాలను ఎంతగా ప్రమోట్ చేసినా ప్రేక్షకులకు ఎక్కడం లేదు. మినిమమ్ ఓపెనింగ్స్ కూడా కష్టమే అన్నట్టుగా చిన్న చిత్రాల పరిస్థితి ఉంది. మరి ప్రతి వారం ఇలా అయితే ఎలా, ఆడియన్స్ అల్లాడిపోరూ..!







































