నాగవంశీపై అక్కినేని ఫ్యాన్స్ ఒత్తిడి

Akkineni fans pressure Naga VamsiAkkineni fans pressure Naga Vamsi


నిర్మాత నాగవంశీ పై అక్కినేని అభిమానులు గుర్రుగా ఉన్నారు. లెనిన్ చిత్రం జూన్ 26 రిలీజ్ అన్నారు. ఇప్పటికి కేవలం ఒక్క సింగిల్ తప్ప మరో ప్రమోషనల్ కంటెంట్ లేదు అంటూ వారు ఆయనపై ఒత్తిడి చేస్తున్నారు. నిన్న బుధవారం యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా నాగవంశీ ట్వీట్ చేస్తూ.. త్రివిక్రమ్ తో చెయ్యబోయే గాడ్ ఆఫ్ వార్ తో కలుద్దామని, డ్రాగన్ గ్లింప్స్ ని పొగుడుతూ ట్వీట్ చేశారు.

ఆ ట్వీట్ చూసిన అక్కినేని అభిమానులు ముందు లెనిన్ చిత్ర టీజర్ వదలమంటూ నాగవంశీని టార్గెట్ చేస్తూ పోస్ట్ లు పెడుతున్నారు. అఖిల్ అసలే ప్లాప్స్ లో ఉన్నాడు. ఇలాంటి సమయంలో అదిరిపోయే కంటెంట్ వదిలి కామన్ ఆడియన్స్ సైతం సినిమాపై ఆసక్తి కలిగేలా చెయ్యాలి కానీ.. ఇప్పటివరకు ఇలా సైలెంట్ గా ఉంటే ఎలా అనేది వారి ప్రశ్న.

మరోపక్క సోషల్ మీడియాలో లేని టీజర్ కమింగ్ సూన్ అంటూ వస్తోన్న ట్వీట్స్ కి నాగవంశీ స్పందించకపోవడంపై కూడా అక్కినేని అభిమానులు ఆగ్రహంగానే ఉన్నారు. మరి నాగవంశీ లెనిన్ ప్రమోషన్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారో చూడాలి.

Naga Vamsi