బ్యూటిఫుల్ లుక్ లో డ్రాగన్ హీరోయిన్

Rukmini Vasanth Latest Look ViralRukmini Vasanth Latest Look Viral

 

యంగ్ టైగర్ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ఫిలిం డ్రాగన్.ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా వదిలిన డ్రాగన్ గ్లింప్స్ సోషల్ మీడియా ని షేక్ చేసాయి. ఈ చిత్రంలో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్ అన్న విషయాన్నీ ఈ గ్లింప్స్ తోనే ప్రకటించారు నీల్.

డ్రాగన్ లో రుక్మిణి వసంత్ చాలా బ్యూటిఫుల్ గా చూడముచ్చటగా కనిపించింది అంటూ ఎన్టీఆర్ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఇక రుక్మిణి వసంత్ సోషల్ మీడియా లుక్స్ ఈమధ్యన తెగ వైరల్ అవుతున్నాయి. పాన్ ఇండియా హీరోయిన్ గా రుక్మిణి వసంత్ కాంతార 2 తోనే పాపులర్ అయ్యింది.

తాజాగా రుక్మిణి షేర్ చేసిన పిక్స్ చూసి వావ్ బ్యూటిఫుల్, సింప్లి సూపర్బ్ అంటూ ఆమె అభిమానులే కాకుండా కామన్ ఆడియన్స్ కూడా కామెంట్లు పెడుతున్నారు. మెరూన్ కలర్ మోడ్రెన్ కాస్ట్యూమ్ లో రుక్మిణి వసంత్ లూజ్ హెయిర్ తో సింపుల్ గానే కనిపించినా ఆకర్షణగా అనిపించింది.
 

Rukmini Vasanth ,