కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం రాజకీయాల్లో సత్తా చాటేందుకు రెడీ అయ్యారు. తమిళనాట TVK పార్టీ పెట్టి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసేందుకు సర్వం సన్నద్ధమయ్యారు. మరి విజయ్ అభిమానుల గురించి చెప్పాలా.. కోలీవుడ్ లో విశేష అభిమానగణం ఉన్న హీరో విజయ్. విజయ్ రాజకీయాల్లో ఉన్నా ఆయన్ని హీరోగానే ప్రేమిస్తారు.
అందుకే ఆయన కరూర్ ర్యాలీలో లెక్కకు మించిన జనం హాజరై తొక్కిసలాటకు కారణమయ్యారు. ఆతర్వాత పెరంబూరు ర్యాలిలోనూ అంతే జనం కనిపించారు. ఇక విజయ్ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తూ తను నిలబెట్టిన అభ్యర్థుల కోసం సభలు, ర్యాలీలు చేపట్టారు. అయితే తాజాగా విజయ్ ర్యాలీలో జనాలు కనిపించని వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
విజయ్ కారు రూఫ్ పై ఎక్కి ప్రసంగిస్తున్న సమయంలో ఆయన కారు వెనుక పెద్దగా జనాలు కనిపించడం లేదు. విజయ్ మాత్రం కారు పై ఎక్కి ఆవేశంగా స్పీచ్ ఇస్తున్న వీడియో ఒకటి వైరల్ గా మారింది. మరి నిజంగానే విజయ్ సభ దగ్గర జనాలు లేరా.. లేదంటే అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
విజయ్ అభిమానులు ఆయన్ని సినిమాల్లో సపోర్ట్ చేసినట్టుగా రాజకీయాల్లో సపోర్ట్ చెయ్యట్లేదా అనే అనుమానము మొదలయ్యింది.





ఇకపై వారణాసి వంతు 

Loading..