Loading...
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Prashanth Neel About NTR Character In Dragon

ఎన్టీఆర్ ఎవ్వరి మాట వినరు

Prashanth Neel About NTR Character In Dragon


యంగ్ టైగర్ ఎన్టీఆర్ డ్రాగన్ చిత్రం కోసం బక్కగా, పీలగా మారడం ఆయన అభిమానులకే నచ్చలేవు, మరి ఫ్యామిలీ ఎలా ఊరుకుంది అదే ప్రశ్నకు దర్శకుడు ప్రశాంత్ నీల్ సమాధానం వింటే ఎన్టీఆర్ ఎవ్వరి మాట వినరు అంటారేమో. డ్రాగన్ కోసం ఎన్టీఆర్ దాపుగా నాలుగు నెలల్లో 15 కిలోల బరువు తగ్గారనే ప్రచారం ఉంది.

అదే విషయాన్నీ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ప్రశాంత్ నీల్ ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. తాను డ్రాగన్ కోసం మొదట్లో ఎన్టీఆర్ లుక్ టెస్ట్ చేసి హంతకుడి పాత్ర కోసం కాస్త బరువు తగ్గి ఇంకాస్త షార్ప్ గా ఉంటె బావుంటుంది అనగానే ఎన్టీఆర్ తన ట్రైనర్ ని 30 నిమిషాల్లో పిలిపించడమే కాదు నెక్స్ట్ డే మార్నింగ్ నుంచే తన వర్కౌట్స్ స్టార్ట్ చేసారు.

ఎన్టీఆర్ ఒక్కసారిగా బరువు తగ్గడం అందరికి షాకిచ్చింది. ఆయన భార్య, తల్లి, ఇంకా ఫ్రెండ్స్ అంతా నాపై కోపంగా కనిపించారు, నా టీమ్ అయితే నాపై చాలా అసంతృప్తిగా ఉంది. నేను కేవలం కొద్దిగా బరువు తగ్గమని మాత్రమే ఆయనకు చెప్పాను. కానీ ఆయన దానిని సీరియస్ గా తీసుకున్నారు.

ఆ తర్వాత నాలుగు నెలల పాటు ఎన్టీఆర్ షూటింగ్‌కు రాలేదు. ఒకానొక దశలో ఏకంగా 15 కిలోల బరువు తగ్గారు. ఆయన పాలిపోయి, బలహీనంగా కనిపించడం మొదలుపెట్టాక చాలాసార్లు ఆపమని చెప్పాను, కానీ ఆయన ఆగలేదు, ఆయన ఎవ్వరి మాట వినరు. బరువు తగ్గే క్రమంలో ఆయన చాలా బాధపడటం మేం చూశాం. ఆ నింద అంతా నాపైనే పడింది అంటూ నీల్ చెప్పుకొచ్చాడు.

 

Prashanth Neel,