Loading...
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Marriages can go wrong says Sara Ali Khan

ఒకసారి మోసం చేస్తే.. ఎప్పుడూ మోసగాడే!

Marriages can go wrong says Sara Ali Khan

 

ఆధునిక కాలంలో ప్రేమ, పెళ్లి, మానవ సంబంధాల వెనుక ఉండే నమ్మకం - విశ్వసనీయతపై సరికొత్త చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా యువత తమ భాగస్వాముల నుండి కచ్చితమైన నిబద్ధతను ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ కిడ్, నటి సారా అలీ ఖాన్ సంబంధాలలో జరిగే మోసం ,నమ్మకద్రోహం  గురించి చేసిన కొన్ని బోల్డ్ వ్యాఖ్యలు  సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

రిలేషన్షిప్స్‌లో లాయల్టీ అనేది అత్యంత కీలకమని తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. `ఒకసారి మోసం చేసిన వ్యక్తి, ఎప్పటికీ మోసగాడిగానే మిగిలిపోతాడు` అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రేమ బంధంలో భాగస్వామిని ఒకసారి మోసం చేసిన వారికి రెండో అవకాశం ఇవ్వడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని అభిప్రాయపడ్డారు. ఒకసారి నమ్మకాన్ని వమ్ము చేసిన మనస్తత్వం ఉన్న వ్యక్తులు భవిష్యత్తులో కూడా అదే తప్పును పునరావృతం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అందుకే అలాంటి రిలేషన్స్ నుండి వీలైనంత త్వరగా బయటకు రావడం మంచిదని సారా స్పష్టం చేశారు.

అయితే సారా కో-స్టార్ ,విలక్షణ నటుడు ఆయుష్మాన్ ఖురానా మాత్రం ఈ విషయంలో సారా అలీ ఖాన్ ఆలోచనా విధానంతో పూర్తిగా విభేదించారు.  సున్నితమైన అంశంపై ఆయుష్మాన్ ఒక భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. `మనుషులు ఎప్పుడూ ఒకేలా ఉండరు. పరిస్థితులు, వయసు , అనుభవాల వల్ల కాలక్రమేణా మనుషుల్లో మార్పు వస్తుంది. ఒకానొక దశలో తప్పు చేసిన వ్యక్తి, ఆ తర్వాత తన తప్పును తెలుసుకుని పూర్తిగా మారే అవకాశం ఉంది` అని ఆయుష్మాన్ విశ్లేషించారు.
 

Sara Ali Khan,