లేట్ అయితే అయ్యింది కానీ..

Mega 158 Opening CeremonyMega 158 Opening Ceremony

 
మెగాస్టార్ చిరంజీవి-బాబీ కొల్లి ల మెగా 158 చిత్రం మొదలు కావడానికి లేట్ అయితే అయ్యింది కానీ.. ఈరోజు గురువారం ఉదయం జరిగిన పూజా కార్యక్రమాలతో మెగా 158 చాలా అంటే చాలా గ్రాండ్ గా మొదలైంది, అది కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్లాప్ తో మెగాస్టార్ మూవీ పూజా కార్యక్రమాలతో మొదలైంది.

ఎప్పుడో ఏప్రిల్ లో మొదలు కావాల్సిన మెగా 158 చిత్రం.. నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ (జాన్ నాయగన్ లీకులతో) ఇబ్బందుల కారణంగా వాయిదాపడింది. వాయిదా పడితే పడింది కానీ నేడు మాత్రం అంగరంగ వైభవంగా మెగా అభిమానులకు కన్నుల పండుగగా ఈ చిత్రం ఆరంభమైంది. ఈ ఓపినింగ్ లో మెగా బ్రదర్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.

ఈ కార్యక్రమంలో KVN ప్రొడక్షన్ అధినేతలు మెగాస్టార్ చిరు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లను ప్రత్యేకంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి చిరు కూతురు కేరెక్టర్ చేస్తున్న అనశ్వర రాజన్ హాజరయ్యారు.

Mega 158,