తన చివరి సినిమా విడుదల కాకపోవడం వెనుక ఓ కుట్ర కోణం దాగుంది అంటూ TVK నేత విజయ్ సెన్సేషనల్ కామెంట్స్ చేసారు. జనవరి 9 న విజయ్ చివరి చిత్రమైన జన నాయగన్ విడుదల కావాల్సి ఉండగా.. సెన్సార్ క్లియరెన్స్ లేక సినిమా విడుదల వాయిదాపడుతూ వస్తుంది. దీని వెనుక రాజకీయ కుట్ర ఉంది అనే ప్రచారం ఉంది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రెండు కీలక స్థానాల్లో పోటీకి దిగుతున్న స్టార్ నటుడు, టీవీకే అధినేత విజయ్ జన నాయగన్ విడుదల అలాగే కరూర్ తొక్కిసలాట ఘటనపై కీలక వ్యాఖ్యలు చేశారు. కరూర్ తొక్కిసలాట ఘటన వెనక ఉమ్మడి కుట్ర కోణం దాగి ఉందని ఆయన ఆరోపించారు.
కరూర్ తొక్కిసలాట ఘటనలో తనకూ న్యాయం జరగాలన్న విజయ్ తన చివరి చిత్రం జననాయగన్ విడుదల ఆలస్యం విషయంలోనూ కుట్ర చేసినట్లు ఈ సందర్భంగా ఆరోపించారు. ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న విజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు.





పీఎం మోడీకి నారా లోకేష్ థాంక్స్ 

Loading..